రెండేళ్లలో మొత్తం కథ మారిపోయింది, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీని ప్రశంసించిన నటుడు మాధవన్

Indian Actor R Madhavan Praises PM Modi’s Digital Economy Push At Cannes Film Festival, Actor R Madhavan Praises PM Modi’s Digital Economy Push At Cannes Film Festival, R Madhavan Praises PM Modi’s Digital Economy Push At Cannes Film Festival, Hero R Madhavan Praises PM Modi’s Digital Economy Push At Cannes Film Festival, PM Modi’s Digital Economy Push At Cannes Film Festival, Cannes Film Festival, PM Modi’s Digital Economy Push, Cannes Film Festival News, Cannes Film Festival Latest News, Cannes Film Festival Latest Updates, Cannes Film Festival Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశంలో ‘సూక్ష్మ-ఆర్థిక వ్యవస్థ’ అద్భుత విజయాన్నిసాధించిందని నటుడు ఆర్ మాధవన్ ప్రశంసించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందంతో కలిసి ఫ్రాన్స్ లోని 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన ఈరోజు జరిగిన ఒక సమావేశంలో ప్రధాని మోదీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు అందుకున్నాక మోదీ ఒక వినూత్న ఆలోచనతో మైక్రో-ఎకానమీ మరియు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టారని, ఇది చాలా సాహసంతో కూడిన నిర్ణయమని అభివర్ణించారు. స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగించాలో లేదా వారి అకౌంటింగ్‌ను ఎలా నిర్వహించాలో రైతులకు తెలియని దేశంలో డిజిటలైజేషన్ పెద్ద విపత్తు అని, ఇది సాధ్యపడదని ప్రపంచం మొదట్లో సందేహించిందని మాధవన్ గుర్తు చేశారు.

అయితే రెండేళ్లలో మొత్తం కథ మారిపోయిందని, రైతులకు డబ్బులు అందాయో లేదో తెలుసుకోవడానికి ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం లేదన్న కారణంగానే ఇలా జరిగిందని మాధవన్ అన్నారు. భారతదేశంలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ యొక్క అతిపెద్ద వినియోగదారులలో భారతదేశం ఒకటిగా మారిందని ఆయన అన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం నగదుపై తక్కువ ఆధారపడే డిజిటల్ ఎకానమీ వైపు కేంద్రం దూకుడుగా దూసుకుపోతున్న నేపథ్యంలో మాధవన్ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాగా మార్చే డు ఫిల్మ్స్ (కేన్స్ ఫిల్మ్ మార్కెట్)లో భారతదేశం ఈ సంవత్సరం గౌరవ దేశంగా ఎంపికైంది. భారత బృందానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =