ప్రతిష్టాత్మక ‘థామస్‌ కప్‌’ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన భారత పురుషుల జట్టు.. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే మొదటిసారి

Indian Men's Badminton Team Wins Maiden Thomas Cup Title Against Indonesia, India won its maiden Thomas Cup title, beating 14-time champion Indonesia 3-0 in the final in Bangkok, Maiden Thomas Cup final in Bangkok, Maiden Thomas Cup final, India wins first Thomas Cup title, Indian Men's Badminton Team wins first Thomas Cup title, Thomas Cup title, India's men's badminton team wins Maiden Thomas Cup Title, Indonesia, Indian Men's Badminton Team, Men's Badminton Team, India's men's badminton lifted the Thomas Cup title, Thomas Cup Title News, Thomas Cup Title Latest News, Thomas Cup Title Latest Updates, Thomas Cup Title Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ రికార్డు సృష్టించింది. ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌గా భావించే ‘థామస్‌ కప్‌’ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అపూర్వ విజయం సాధించింది. ఇప్పటివరకూ ఇండోనేషియా ఈ ‘థామస్‌ కప్‌’ టైటిల్‌ను 14 సార్లు గెలుచుకోవడం విశేషం. అలాంటి బలమైన జట్టుపై భారత్ సాధించిన అద్భుత విజయం ఇది. భారత్ అందుకున్న ఈ చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలైన.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్‌, తెలంగాణ ప్లేయర్‌ పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్, కోచ్‌ సియాదతుల్లా కీలకపాత్ర పోషించారు.

ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఫైనల్స్‌లోని మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్, జోనటన్ క్రిస్టీని ఓడించి భారత్‌కు తొలి థామస్ కప్ టైటిల్‌ను అందించాడు. మొదటగా పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్య సేన్ గెలుపొందాడు. ఆ తర్వాత సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మహమ్మద్ అహ్సన్ మరియు కెవిన్ సంజయ సుకముల్జోపై గెలిచారు. శ్రీకాంత్ విజయంతో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తేరా పడింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజాలైన ప్రకాశ్‌ పదుకొనె, జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వంటి వారికి కూడా ఈ విజయం అందని ద్రాక్షే అయింది. కానీ, ఇప్పుడు యువ భారత జట్టు ఈ అసాధారణ విజయం అందుకోవడం గమనార్హం. కాగా భారత్ సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (BWF) ఒక ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =