దేశ 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్‌

Rajiv Kumar Assumed Charge as the 25th Chief Election Commissioner of India, 25th Chief Election Commissioner of India, Rajiv Kumar Takes Charge as the 25th Chief Election Commissioner of India, Rajiv Kumar takes charge as 25th CEC of India, Former Finance Secretary Rajiv Kumar, Former Finance Secretary Rajiv Kumar Assumed Charge as the 25th Chief Election Commissioner of India, Rajiv Kumar has been Appointed as New Chief Election Commissioner of India, New Chief Election Commissioner of India, Election Commissioner of India, Rajiv Kumar appointed as next Chief Election Commissioner, Rajiv Kumar to take over as Chief Election Commissioner, Rajiv Kumar appointed next CEC, Rajiv Kumar will take up the post after incumbent Chief Election Commissioner, Ministry of Law and Justice, Rajeev Kumar will be replacing Sushil Chandra who conducted the last five state assembly elections in 2022, five state assembly elections in 2022, 2022 five state assembly elections, Rajiv Kumar has been appointed as the next Chief Election Commissioner in the Election Commission of India, Election Commissioner, Election Commissioner News, Election Commissioner Latest News, Election Commissioner Latest Updates, Election Commissioner Live Updates, Mango News, Mango News Telugu,

దేశ నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా (సీఈసీ) రాజీవ్ కుమార్‌ నియమితులయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం, నిర్వాచన్ సదన్‌లో 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1, 2020 నుండి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో 2020లో బీహార్ లో, 2021 మార్చి-ఏప్రిల్‌లో కోవిడ్ మహమ్మారి ఆందోళనల మధ్యనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 2022 ప్రారంభంలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అందించిన అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సంస్థకు నాయకత్వం వహించే బాధ్యత తనకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భారత పౌరులకు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలను అందించడానికి, ఓటర్ల జాబితాల స్వచ్ఛతను నిర్ధారించడానికి, అవకతవకలను నిరోధించడానికి, మన ఎన్నికల నాణ్యతను పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం గత 70 సంవత్సరాలలో చాలా చేసిందన్నారు. మెరుగైన ఎన్నికల నిర్వహణ, పారదర్శకత మరియు ఓటరు సేవలను సులభతరం చేయడం కోసం ప్రక్రియల కోసం సాంకేతికతను మరింత ప్రధాన సాధనంగా మారుస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =