58 ఏళ్ల తర్వాత ఇండియన్‌ రైల్వేస్‌ తీసుకున్న నిర్ణయంతో రైల్వే లాభాల బాట పడుతుందా?

Indian Railways Restored Akbar The 58 Year old Locomotive To working Condition at Heritage Steam Shed in Haryanas Rewari,Indian Railways Restored Akbar,58 Year old Locomotive To working Condition,Heritage Steam Shed in Haryanas Rewari,Restored Akbar The 58 Year old Locomotive,Mango News,Mango News Telugu,Akbar Locomotive, Indian Railways, Ancient Steam Locomotive,Indian Railways, Locomotive, CLW, HIGH END Express,Indian Railways Latest News,Indian Railways Latest Updates,Indian Railways Live News

భారతీయ రైల్వేస్‌ .. అక్బర్‌ పేరుతో ఉన్న 58 ఏళ్ల లోకోమోటివ్‌ను తిరిగి తీసుకురావడానికి.. భారతీయ రైల్వే చాలా కాలంగా కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు హర్యానాలోని రేవారిలో ఉన్న హెరిటేజ్ స్టీమ్ షెడ్‌లో.. పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని అధికారులు తిరిగి తీసుకువచ్చారు. అయితే ఆదాయ పరంగా భారత్ రైల్వేలకు ఎంత వరకూ లాభం ఉంటుందనే చర్చ కొనసాగుతూనే ఉంది.

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అంటే సీఎల్‌డబ్ల్యూ వద్ద నిర్మించిన పురాతన స్టీమ్ లోకోమోటివ్.. ఇప్పటికీ ఉనికిలో ఉన్న కొన్ని వాటిలో ఒకటిగా ఉంది. 1965లో లేదా డబ్ల్యూపీ 7161ను నిర్మించారు. మొఘల్ చక్రవర్తి అబుల్ ఫత్ జలాల్ ఉద్ దిన్ ముహమ్మద్ అక్బర్ పేరు ఈ డబ్ల్యూపీకి పెట్టారట. రికార్డ్‌లో ఉన్న డేటా ప్రకారం ఈ లోకోమోటివ్‌ గంటకు 110 కిలోమీటర్ల స్పీడుతో పరిగెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పసిఫిక్ క్లాస్ ఆఫ్ బ్రాడ్ గేజ్ లోకోపైలట్ అప్పట్లో హై-ఎండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను లాగే కెపాసిటీతో ఉండేది.

2012 లోనే లోకోమోటివ్ పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు భారత్‌కు రానున్న లోకోపైలట్ ద్వారా ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని అల్వార్‌కు టూరిస్టులను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావించారు. ఇది నార్తర్న్ రైల్వేస్ అమృత్‌సర్ వర్క్‌షాప్‌లో.. మరోసారి దీనిని అన్ని రకాలుగా చెక్ చేసి.. తర్వాత చిన్నచిన్న మార్పులతో అప్‌డేట్ చేసి, రిపేర్ చేశారు. లోకో సరిస్కా నేషనల్ పార్క్ టూర్ తో సహా ఢిల్లీ నుంచి అల్వార్ మార్గంలో ప్రయాణాలు అందిస్తూ, ప్రత్యేక ప్యాకేజీలతో ప్యాకేజీలతో పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

మరోవైపు లోకోమోటివ్ మళ్లీ ఇండియన్ రైల్వేలలో ఎంట్రీ ఇచ్చినప్పుటి నుంచి ఇది 20 కంటే ఎక్కువ బాలీవుడ్ చిత్రాలలో కూడా ఉపయోగించారు. భాగ్ మిల్కా భాగ్ అనే ఐకానిక్ ఫిల్మ్‌లో ఉపయోగించారు. ఈ చిత్రానికి చారిత్రక టచ్ ఇవ్వడానికి ఈ శక్తివంతమైన యంత్రాన్ని కూడా ఉపయోగించారు. ఇది కాకుండా లోకో సుల్తాన్‌లో కూడా కనిపించింది. ఇక్కడ నటుడు సల్మాన్ ఖాన్ పాత ఆవిరి లోకోమోటివ్‌లలో ఒకదాని వెంట నడుస్తున్నప్పుడు దాని అధిక వేగంతో పోటీ పడుతున్నట్లు కనిపించాడు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆవిరి ఇంజిన్లతో భారతీయ రైల్వేకు ఆదాయం సమకూరుతుందో? లేదో? వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =