ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 % పన్ను.. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

FM Nirmala Sitharaman Says 28% GST on Online Gaming to be Effected From October 1,FM Nirmala Sitharaman Says 28% GST,Sitharaman Says 28% GST on Online Gaming,Online Gaming to be Effected From October 1,Nirmala Sitharaman on Online Gaming,Mango News,Mango News Telugu,28% tax on online gaming, what will be the effect, Online Gaming Tax, Tax collection on online gaming,Income tax,FM Nirmala Sitharaman Latest News,FM Nirmala Sitharaman Latest Updates,FM Nirmala Sitharaman Live News,GST on Online Gaming Latest News,GST on Online Gaming Latest Updates

ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో మాత్రమే కనిపించే ఆన్ లైన్ గేమింగ్.. ఇప్పుడు భారతదేశంలోనూ ఫాస్ట్‌గా పాకిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఆన్‌లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేసింది.

అవును ..ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం ట్యాక్స్‌ను కేంద్రం వసూలు చేయడానికి రెడీ అయిపోయింది. దీనిలో గుర్రపు పందెం, క్యాసినో వంటి ఆన్‌లైన్ గేమ్‌లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లకు ఖర్చు చేసే డబ్బు ఇప్పటి వరకూ బెట్టింగ్ పరిధిలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే దానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు.. 28 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తాజాగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ఆన్‌లైన్ గేమ్‌లతో పాటు, క్యాసినో, గుర్రపు పందాలపై ట్యాక్స్ రికవరీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీనిని అమలులోకి తీసుకువచ్చాక.. దీని ప్రభావం ఎలా ఉందో 6 నెలల తర్వాత ప్రభుత్వం సమీక్షిస్తుంది. దీంతో ఇప్పుడు ఆన్‌లైన్ గేమింగ్‌పై ఈ పన్ను ప్రభావం వినియోగదారులపై ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.

ఇప్పటి వరకూ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాళ్లు, పేకాట ఆడేవాళ్లు గేమింగ్ కంపెనీ వసూలు చేసే చార్జీలతో పాటు, వారు పందెం వేసినప్పుడు కానీ లేదా గెలిచిన తర్వాత కానీ ఆ డబ్బుపై ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కొత్త రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఒక్కో ఆటపై గెలిచిన డబ్బుపై వెంటనే 28% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ట్యాక్స్ అమలు వల్ల ఇకపై ఎవరైనా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాళ్లు, పేకాట ఆడేవాళ్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందన్న మాట. ఈ కొత్త నియమాలు అమలు అయిన తర్వాత ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాళ్లు 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది వారు ఆడే గేమ్‌లోని మొత్తం డబ్బుపై 28% ట్యాక్స్ పే చేయాలి. రెండోది వాళ్లు గెలుచుకున్న డబ్బుపై 30% ట్యాక్స్ కూడా ఉంటుంది. అంతేకాదు.. మూడోది గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్లి ఆట ఆడటానికి సర్వీస్ ఛార్జెస్‌ను వసూలు చేస్తూ ఉంటుంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్‌తో.. ఇకపై ఎవరైనా ఆట ఆడాలనుకుంటే.. మూడు రకాలుగానూ ఈ ఆన్ లైన్ గేమింగ్ కోసం ఇంకాస్త ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది.

క్రికెట్, కబడ్డీ, లూడో, కార్డులు వంటి ఆటలలో కూడా వేసే బెట్టింగ్ జూదంగానే పరిగణిస్తారు. అయితే ఇకపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్‌తో ఇవన్నీ.. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ఉంటే అవి చట్టబద్ధం అవుతాయన్న మాట. ఎంత కట్టుదిట్టం చేసినా బెట్టింగ్ వంటివి రూపు మాపలేకపోతున్నారు. చాపకింద నీరులా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో బెట్టింగ్, చీటింగ్ గేమ్‌లను నిషేధించే బదులు, వారికి స్టార్టప్ మినహాయింపు ఇవ్వడంతో కేంద్రానికి అదనపు ఆదాయం వస్తుంది. దీనిని ఇకపై స్కిల్, బెట్టింగ్ పేరుతో ఆన్‌లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ విధించనున్నారు.నిజానికి భారత చట్టం ప్రకారం.. ఎలాంటి స్పోర్ట్స్ కు కూడా బెట్టింగ్ అనుమతించబడదు. కానీ దీనిని ఆన్‌లైన్ గేమింగ్‌లో చట్టబద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం అయితే విదేశీ గేమింగ్ కంపెనీల నుంచి మాత్రమే జీఎస్టీని వసూలు చేసేందుకు తగిన నిబంధనలు ఉన్నాయి. కానీ చాలా విదేశీ ఆఫ్‌షోర్ కంపెనీలు.. ప్రాడ్స్ చేసి పెద్ద ఎత్తున ట్యాక్స్ ఎగ్గొడుతున్నాయి. మూడేళ్ల నుంచీ ఇప్పటి వరకూ దాదాపు 58 వేల కోట్ల ప్రైజ్ మనీపై ట్యాక్స్ చెల్లించని గేమింగ్ కంపెనీలకు.. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఇప్పటికీ చాలా గేమింగ్ కంపెనీలు..దాదాపు 30 వేల కోట్ల ట్యాక్స్ కు ఎగనామం పెట్టిన కేసులో చిక్కుకున్నాయి. దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్, కోర్టుల రాడార్‌లో నడుస్తున్న.. గేమింగ్ కంపెనీల నుంచి ట్యాక్స్‌ దీ రికవరీ కోసం కఠినమైన చట్టాలను రూపొందించడంతో పాటు.. వాటి నుంచి నష్టాలను నివారించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కేంద్రం 28% ట్యాక్స్ విధించడం వల్ల పన్ను ఎగవేత వంటి కేసులను తగ్గించవచ్చు.

అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆట ఆడేవారెవరయినా ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలిచిన మొత్తంపై.. 28 శాతం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకతను ఒక ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 500 గెలిచాడనుకుంటే.. ఆ గేమ్‌కు అతని ఎంట్రీ ఫీజు రూ. 100 అయితే.. టీడీఎస్‌ పోనూ అంటే రూ. 500 నుంచి ఎంట్రీ ఫీజు రూ. 100 పోతే రూ 400 ఉంటుంది. దీనిలో 28 శాతం టీడీఎస్ పోతే రూ.288 అతనికి మిగులుతుందన్నమాట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =