బ్రో సినిమా వివాదంపై పవన్‌ స్పందన ఇదే..!

Jana Sena Chief Pawan Kalyan Responds Over Bro Movie Issue,Jana Sena Chief Pawan Kalyan,Pawan Kalyan Responds Over Bro Movie,Bro Movie Issue,Pawan Kalyan Responds Over Bro,Mango News,Mango News Telugu,Pawans response to the Bro movie controversy, Pawan, Bro movie controversy, Ap Politics, Janasena, Ambati Rambabu,Pawan Kalyan First Reaction On Ambati Rambabu,Pawan Kalyan reaction on BRO movie controversy,Bro movie controversy,Jana Sena Chief Latest News,Jana Sena Chief Latest Updates,Jana Sena Chief Live News

బ్రో సినిమాపై రంకెలు వేస్తున్న వారికి పవన్ దీటైన సమాధానం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా బ్రో సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. అయితే ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌పై వివాదం నెలకొంది. అది తనను ఉద్దేశించి పెట్టిన క్యారెక్టర్ అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు చిత్రం యూనిట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మంత్రి రాంబాబు రెండుసార్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. బ్రో సినిమా కలెక్షన్లు కూడా వివరించారు. ఈ చిత్రం టీడీపీ స్పాన్సర్షిప్‌తో నిర్మించిందని చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి ప్యాకేజీ అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారని ఆరోపణలు చేశారు. ఏకంగా తెలుగు సినీ పరిశ్రమను హెచ్చరించారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు హడావిడి చేశారు.

మరోవైపు పవన్‌పై ఇటువంటి చిత్రాలను తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు అంబటి ప్రకటించారు. ఇందుకుగాను కొన్ని సినిమా పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి జన సైనికులు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తిరుపతిలో అయితే ఏకంగా సందులో సంబరాల శ్యాంబాబు పేరిట ఒక సినిమాను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై జనసైనికులు వ్యంగ్యాస్త్రాలతో విమర్శలకు దిగారు. తాను నిర్వర్తిస్తున్న మంత్రిత్వ శాఖపై దృష్టి పెట్టకుండా.. ఇలా సినిమా ట్రిప్స్‌ ఏమిటన్న విమర్శలు ఆయనపై వ్యక్తం అయ్యాయి. దీంతో ఢిల్లీ వెళ్లి తోక జాడించిన ఆయన సాగునీటి శాఖపై అధికారులను కలిసి చేతులు దులుపుకున్నారు.

చివరకు బ్రో వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి అని సూచించారు. పార్టీని నడిపేందుకు నాకు సినిమాలు ఇంధనమని చెప్పుకొచ్చారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తానే ఆ సినిమా చేసి వదిలేసానని.. మీరెందుకు పట్టుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ సూచించారు. ఇకపై ఆ సినిమాపై మాట్లాడొద్దంటూ పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. అయితే పవన్ ఊరుకున్నా వైసీపీ నేతలు ఊరుకుంటారో లేదో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =