న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి, సీఎంసీజే సంయుక్త సదస్సులో ప్రధాని మోదీ

PM Modi Inaugurates Joint Conference of CMs of the States and Chief Justices of High Courts at Delhi, Prime Minister Narendra Modi Inaugurates Joint Conference of CMs of the States and Chief Justices of High Courts at Delhi, Modi Inaugurated Joint Conference of CMs of the States and Chief Justices of High Courts at Delhi, Modi Launches Joint Conference of CMs of the States and Chief Justices of High Courts at Delhi, Joint Conference of CMs of the States and Chief Justices of High Courts at Delhi, Joint Conference of CMs of the States at Delhi, Joint Conference of Chief Justices of High Courts at Delhi, Chief Justices, CMs of the States, New Delhi, Joint Conference, PM Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, PM Narendra Modi, Mango News, Mango News Telugu,

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రారంభ సెషన్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యుయు లలిత్‌, కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, ప్రొఫెసర్‌ ఎస్‌పి సింగ్‌ బాఘెల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు/న్యాయశాఖ మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, మ‌న దేశంలో న్యాయ‌వ్యవస్థ పాత్ర రాజ్యాంగ సంరక్షణ అని, లెజిస్లేచర్ పౌరుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. అయితే రాజ్యాంగంలోని ఈ రెండు శాఖల కలయిక మరియు సమతుల్యత దేశంలో సమర్థవంతమైన, సమయానుకూల న్యాయ వ్యవస్థ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుందని నమ్ముతున్నానన్నారు. 75 స్వాతంత్య్రం న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాఖల పాత్రలు, బాధ్యతలను నిరంతరం స్పష్టం చేసిందన్నారు. అవసరమైన చోట ఈ సంబంధం దేశానికి దిశానిర్దేశం చేయడానికి నిరంతరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సదస్సును రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. తాను చాలా కాలంగా ఈ సదస్సుకు వస్తున్నానని, మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నానని అన్నారు.

2047 నాటికీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది, అప్పుడు మనం దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాము, 2047 నాటి భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి?, ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలని ప్రధాని సూచించారు. ఈ సమయంలో మన దృష్టి సులభ న్యాయం, సత్వర న్యాయం మరియు అందరికీ న్యాయం చేసే న్యాయ వ్యవస్థపై ఉండాలని అన్నారు. న్యాయం అందించడంలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, న్యాయవ్యవస్థ బలాన్ని పెంపొందించడానికి మరియు న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని ఉద్ఘాటించారు. కేసుల నిర్వహణ కోసం ఐసీటీని వినియోగించామని, న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిల్లో ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి:

న్యాయవ్యవస్థ పని సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాని సూచించారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో న్యాయవ్యవస్థలో సాంకేతికత యొక్క అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తుందని, దీనిని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ-కోర్టుల ప్రాజెక్టును నేడు మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానాలలో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని, తద్వారా దేశంలోని ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానించబడినట్లు భావిస్తారని, వారి విశ్వాసం పెరుగుతుందని ప్రధాని అన్నారు. దీంతో న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని, సాంకేతిక విద్యలో కూడా స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =