జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు

PM Modi held Meetings with PM's of UK Australia Singapoore Italy on the Sidelines of G-20 Summit in Bali,Modi Unveil Logo G20 Presidency,Modi Unveil Theme G20 Presidency,G20 Presidency Website Launch,Mango News,Mango News Telugu,PM Narendra Modi Latest News And Updates,PM Narendra Modi, India’s G20 Presidency,G20 Presidency Launch, PM Modi Launch G20 Presidency, G20 Presidency News And Updates, Indian Prime Minister Latest News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి సునాక్, సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ లతో ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

యూకే ప్రధాని రిషి సునాక్, ప్రధాని మోదీ మధ్య ఇదే తొలి భేటీ. ఇటీవలే యూకే ప్ర‌ధానిగా బాధ్యతలు స్వీకరించిన సునాక్ ను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. “భారతదేశం-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు భవిష్యత్తు సంబంధాల కోసం రోడ్‌మ్యాప్ 2030లో పురోగతిపై ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. జీ-20 మరియు కామన్వెల్త్‌తో సహా ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక ఫోరమ్‌లలో కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు ప్రశంసించారు. వాణిజ్యం, మొబిలిటీ, రక్షణ మరియు భద్రత వంటి ముఖ్యమైన సహకార రంగాలపై ప్రధాని రిషి సునాక్, ప్రధాని మోదీ మధ్య చర్చలు జరిగాయి” అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో చర్చల సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరుదేశాల మధ్య సంబంధాల యొక్క అద్భుతమైన స్థితి మరియు భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య క్రమ పద్ధతిలో జరుగుతున్న ఉన్నతస్థాయి పరస్పర చర్యలపై ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిపారు. “రక్షణ, వాణిజ్యం, విద్య, క్లీన్ ఎనర్జీ మరియు ప్రజల మధ్య సంబంధాలతో సహా విభిన్న శ్రేణి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విద్యారంగంలో సంస్థాగత భాగస్వామ్యం, ప్రత్యేకించి ఉన్నత విద్య, వృత్తి విద్య, శిక్షణ, సామర్థ్యం పెంపుదల వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. పరస్పర ఆసక్తితో కూడిన ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై నాయకులు అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు, ఇందులో స్థిరమైన, శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాంతం, వాతావరణ సంబంధిత విషయాలు మరియు భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ కోసం వారి భాగస్వామ్య విజన్ పై చర్చించారు” అని తెలిపారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సమావేశం సందర్భంగా, ఇటలీ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మెలోనిని ప్రధాని మోదీ అభినందించారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద వ్యతిరేకత, ప్రజలతో మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు.

సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ తో సమావేశం సందర్భంగా గత ఏడాది రోమ్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని లీతో తాను జరిపిన సమావేశాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. భారత్ మరియు సింగపూర్ మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరియు 2022 సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన భారతదేశం-సింగపూర్ మంత్రుల రౌండ్ టేబుల్ ప్రారంభ సెషన్‌తో సహా, రెగ్యులర్ హైలెవెల్ మంత్రుల మరియు సంస్థాగత పరస్పర చర్యలపై ప్రధానమంత్రులు ఇద్దరూ చర్చించారు. ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫిన్‌టెక్, రెన్యువబుల్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, ఔషధ రంగాలలో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను మరింత విస్తరించేందుకు తమ నిబద్ధతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. గ్రీన్ ఎకానమీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటలైజేషన్‌తో సహా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని మరియు భారతదేశం యొక్క నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, అసెట్ మానిటైజేషన్ ప్లాన్ మరియు గతి శక్తి ప్రణాళికను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ సింగపూర్‌ను ఆహ్వానించారు. ఇటీవలి ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో సింగపూర్ పాత్రను మరియు 2021-2024 మధ్య ఆసియాన్-భారత్ సంబంధాల దేశ సమన్వయకర్తగా సింగపూర్ పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.

ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమావేశం సందర్భంగా రక్షణ, సివిల్ న్యూక్లియర్, వాణిజ్యం, పెట్టుబడులు వంటి విభిన్న రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఎకనామిక్ ఎంగేజ్మెంట్ సంబంధించిన కొత్త రంగాలలో సహకారం మరింతగా పెరగడాన్ని కూడా వారు స్వాగతించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా వారు చర్చించారు.

జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీల మధ్య ఈ ఏడాది ఇది ​​మూడో సమావేశం. 6వ భారత్-జర్మనీ అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల కోసం 2022 మే 2న బెర్లిన్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఓసారి, ఆ తర్వాత ఛాన్సలర్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జీ-7 సమ్మిట్‌కు భాగస్వామి దేశంగా, అలాగే జర్మనీలోని ష్లోస్ ఎల్మావుకు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మునుపటి సమావేశాలు జరిగాయి. ఐజీసీ సమయంలో ప్రధాని మోదీ మరియు జర్మన్ ఛాన్సలర్ గ్రీన్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌పై భాగస్వామ్యంపై సంతకం చేయడంతో కొత్త దశలోకి ప్రవేశించిన భారత్-జర్మనీల మధ్య విస్తృత శ్రేణి ద్వైపాక్షిక సహకారంపై నాయకులు చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మరియు రక్షణ, భద్రత, వలసలు, మొబిలిటీ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి కూడా వారు అంగీకరించారు. జీ-20 మరియు ఐక్యరాజ్యసమితితో సహా బహుపాక్షిక ఫోరమ్‌లలో సహకారం మరియు సమన్వయాన్ని పెంపొందించుకోవాలని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ అంగీకరించినట్టు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + fifteen =