గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు దశల్లో డిసెంబర్‌ 1, 5వ తేదీల్లో పోలింగ్‌

Election Commission of India Announced Schedule for Gujarat Assembly General Elections, Gujarat Assembly General Elections, Gujarat Elections, Election Commission of India, EC Schedule for Gujarat Assembly General Elections, Mango News, Mango News Telugu, Gujarat General Elections, EC Released Gujarat Elections Schedule, Election Commission of India Gujarat, Gujarat Elections From Dec 1-5, Gujarat Elections Latest News And Updates

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ రోజు (నవంబర్ 3, గురువారం) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్ కుమార్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల (ఎస్సీ రిజర్వేడ్ 13, ఎస్టీ రిజర్వేడ్ 27) ఎన్నికలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1వ తేదీన 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో భాగంగా డిసెంబర్ 5వ తేదీన 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుందని తెలిపారు. అలాగే డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే గుజరాత్ లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన కోవిడ్-19 గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. గుజరాత్ రాష్ట్రంలో సాధారణ ఓటర్లు సంఖ్య 4,90,89,765, సర్వీస్ ఓటర్ల సంఖ్య 27,943 కలిపి మొత్తం 4,91,17,308 ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,782 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ గడువు 2023, ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొదటి దశ (89 అసెంబ్లీ స్థానాలు):

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: నవంబర్ 5
  • నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు: నవంబర్ 14
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 15
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 17
  • అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: డిసెంబర్ 1
  • ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల తేదీ: డిసెంబర్ 8.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రెండో దశ (93 అసెంబ్లీ స్థానాలు):

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: నవంబర్ 10
  • నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు: నవంబర్ 17
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 18
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 21
  • అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: డిసెంబర్ 5
  • ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల తేదీ: డిసెంబర్ 8.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + sixteen =