భారత్‌లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదు – బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

IPL Media Rights e-Auction Shows How Big The Game in Our Country and It's Never Been Just About Money Sourav Ganguly, Sourav Ganguly Says IPL Media Rights e-Auction Shows How Big The Game in Our Country and It's Never Been Just About Money, IPL Media Rights e-Auction Shows How Big The Game in Our Country, How Big The Game in Our Country, IPL Media Rights e-Auction, Sourav Ganguly, It's Never Been Just About Money, IPL Media Rights E-Auction Reports Record Bidding For TV and Digital Sold, IPL Media Rights overall TV and digital rights closed at Rs 43050 crore, 2023-2027 media rights cycle, IPL Media Rights TV and digital rights closed, TV and digital rights closed, IPL Media Rights E-Auction, IPL Media Rights E-Auction Reports, Record Bidding For TV and Digital Sold For Rs 43050 Cr, IPL Media Rights, E-Auction Reports, IPL Media Rights Auction, IPL Media TV Rights, IPL Media Digital Rights, IPL TV and digital Media rights sold, IPL Media Rights E-Auction closed, IPL Media Rights Auction News, IPL Media Rights Auction Latest News, IPL Media Rights Auction Latest Updates, IPL Media Rights Auction Live Updates, Mango News, Mango News Telugu,

భారత్‌లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదని పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఈ మేరకు ఐపిఎల్ మీడియా హక్కుల ఈ-వేలం 2022 ముగిసిన తరువాత ఆయన తన అభిప్రాయాలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దేశంలో ఆట ఎంత బలంగా ఉందో ఈ అద్భుత ఈవెంట్ నిరూపిస్తోందని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఇ-వేలంలో 410 మ్యాచ్‌లకు గాను 2023-2027 కాలానికి టీవీ మరియు డిజిటల్ హక్కులు స్టార్ ఇండియా మరియు రిలయన్స్ భాగస్వామి వయాకామ్ 18కి రూ.48,390 కోట్లకు అమ్ముడు పోయినట్లు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.

భారత్‌లో క్రికెట్ ఎప్పుడూ డబ్బుకు సంబంధించినది కాదు, అంతకు మించిన స్థాయికి వెళ్ళింది. దీనిని అభిమానులు ఒక మతంగా భావిస్తారని తెలిపారు. క్రికెట్ ప్రతిభకు సంబంధించినది, ఐపిఎల్ ఈ-వేలం మన దేశంలో ఆట ఎంత బలంగా ఉందో అందరికీ తెలియజేసిందని వ్యాఖ్యానించారు. అలాగే యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి ప్రేరణనిస్తుందని, తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత 5 దశాబ్దాల ప్రస్థానంలో టీమ్ఇండియా ఇప్పుడు దాని అత్యున్నత స్థాయికి చేరుకుందని గంగూలీ అన్నారు. ఈ సందర్భంగా.. వేలం ప్రక్రియ కోసం గంటల తరబడి ప్లాన్ చేసినందుకు బీసీసీఐలోని తన సహచరులను ఆయన అభినందించారు. లీగ్ వృద్ధిపై నమ్మకం ఉంచినందుకు ప్రసార నెట్‌వర్క్‌లకు సౌరవ్ కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 15 =