నేడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అఖిలపక్ష భేటీ.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆహ్వానం

TPCC President Revanth Reddy Invites YSRTP Chief Sharmila For Congress Led All-Party Meeting in Hyderabad Today, Revanth Reddy Invites YSRTP Chief Sharmila For Congress Led All-Party Meeting in Hyderabad Today, TPCC President Revanth Reddy Invites YSRTP Chief Sharmila, Revanth Reddy Invites YSRTP Chief Sharmila, Congress Led All-Party Meeting in Hyderabad Today, All-Party Meeting in Hyderabad Today, TPCC President Revanth Reddy, TPCC Chief Revanth Reddy, YSRTP Chief Sharmila, Yuvajana Shramika Rythu Telangana Party, Yuvajana Shramika Rythu Telangana Party Chief Sharmila, Telangana Pradesh Congress Committee, Telangana Pradesh Congress Committee President Revanth Reddy, All-Party Meeting News, All-Party Meeting Latest News, All-Party Meeting Latest Updates, All-Party Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ‘హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలు’ అనే అంశంపై టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో తెలంగాణ లోని విపక్ష పార్టీలైన వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్‌టీపీ, టీజేఎస్‌, బీఎస్పీ, ఆప్‌, తెలంగాణ ఇంటి పార్టీ మరియు లోక్‌ సత్తా తదితర పార్టీలను ఆహ్వానించారు. ఆయా పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు, మేధావులు సహా పాత్రికేయ రంగంలోని ఇతర ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.

కాగా ఈ సమావేశానికి రావాలంటూ వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు రేవంత్‌ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణాలో పార్టీ ప్రకటించినప్పటినుంచీ ఒకరిపై ఒకరు అడపాదడపా విమర్శలు చేసుకుంటున్న రేవంత్, షర్మిల ఇలా మాట్లాడుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా రేవంత్ ఇప్పటినుంచే అందరినీ కలుపుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాదయాత్రలో ఉన్నందున తాను రాలేక పోతున్నానని, తన తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి టీ. దేవేందర్‌ను పంపిస్తున్నట్లు షర్మిల రేవంత్‌కు చెప్పారు. కాగా ఇలాంటి అంశాల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పటానికి ఇది ఒక అవకాశంగా షర్మిల భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here