“ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా” పేరుతో నేటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన

TDP Chief Chandrababu to Start Statewide Tours from Today, TDP President Chandrababu to Start Statewide Tours from Today, Chandrababu Naidu to Start Statewide Tours from Today, TDP President Chandrababu Naidu to Start Statewide Tours from Today, TDP Chief Chandrababu Naidu to Start Statewide Tours from Today, Chandrababu to Start Statewide Tours from Today, Chandrababu Statewide Tour from Today, Chandrababu Naidu Statewide Tour from Today, Nara Chandrababu Naidu Statewide Tour from Today, TDP Chief Chandrababu, TDP President Chandrababu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, Chandrababu Naidu Statewide Tour News, Chandrababu Naidu Statewide Tour Latest News, Chandrababu Naidu Statewide Tour Latest Updates, Chandrababu Naidu Statewide Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి (జూన్ 15, బుధవారం) నుంచి “ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా” పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలను శ్రీకారం చుడుతున్నారు. నేడు అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం ఏడాది పాటుగా చంద్రబాబు పర్యటనలు కొనసాగనున్నాయి. కాగా ఏడాదిలో 100కు పైగా నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఒక్కో పర్యటన మూడు రోజుల చొప్పున సాగనుండగా, ప్రతి నెలా మొదటి, చివరి వారాల్లో రెండు పర్యటనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహణ, జిల్లా మహానాడు కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. బుధవారం చోడవరం నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన 3 రోజుల పాటు అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొనసాగనుంది.

ముందుగా చోడవరం నియోజకవర్గంలో తోలి జిల్లా మహానాడు నిర్వహించనున్నారు. అలాగే బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు శిలఫలకాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక జూన్ 16న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 17వ తేదీన విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసే దిశగా ఉత్తరాంధ్ర నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =