ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న సురేశ్‌ రైనా

chennai super kings, Chennai Super Kings Star Suresh Raina, Chennai Super Kings Star Suresh Raina Out Of IPL 2020, CSK Suresh Raina to miss IPL 2020, IPL 2020, IPL 2020 In UAE, IPL 2020 News, IPL 2020 Updates, Suresh Raina Exits IPL 2020, Suresh Raina Of CSK Exits IPL 2020, Suresh Raina Of CSK Exits IPL 2020 Due To Personal Reasons, Suresh Raina Out Of IPL 2020, Suresh Raina to miss IPL 2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2020 నుంచి వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా తప్పుకున్నట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సీఎస్కే సీఈవో కె.ఎస్ విశ్వనాథన్ ఈ విషయాన్ని తెలియజేశారు. “సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు మిగిలిన ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుంది” అని సీఈవో కె.ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. మరోవైపు సురేశ్ రైనా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here