జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్ కు షాక్, ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు?

Jharkhand CM Hemant Soren Likely to Disqualified from Assembly EC Sends Report to Governor on Office of Profit Matter, Office Of Profit Case, Jharkhand CM Hemant Soren CM On ECI Disqualification Recommendation, ECI Recommends Disqualification Of Jharkhand CM, Election Commission Notice To Jharkhand CM Hemant Soren, Mango News, Jharkhand CM Hemant Soren Latest News And Updates, Hemant Soren Party, Jharkhand CM Hemant Soren, Jharkhand Mukti Morcha Party, Jharkhand Governor, Jharkhand Government, Jharkhand Latest News, Jharkhand Chief Minister, Election Commission of India,Jharkhand CM mining lease case,Jharkhand mining case,Profit Case,Mango News Telugu,

జేఎంఎం పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ కు రాజకీయంగా భారీ షాక్ తగలనుంది. ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీఎం హేమంత్ సోరెన్‌ ను అసెంబ్లీ సభ్యత్వానికి (ఎమ్మెల్యే) అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు జార్ఖండ్ గవర్నర్‌ రమేశ్ బైస్ కు ఈసీ లేఖ పంపినట్టు సమాచారం. రాష్ట్రానికి
మైనింగ్ మరియు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉంటూ తన పదవిని దుర్వినియోగం చేస్తూ సీఎం హేమంత్ సోరెన్ తనకు తానే స్టోన్ మైనింగ్ లీజును కేటాయించుకున్నారని ఆరోపనలు చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.

దీనిపై గవర్నర్ ఈసీ అభిప్రాయం కోరగా, ఎన్నికల సంఘం తాజాగా తమ నివేదికను సీల్డ్ కవర్‌లో జార్ఖండ్ రాజ్ భవన్ కు పంపింది. నివేదిక ఆధారంగా సీఎం హేమంత్ సోరెన్‌ పై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం గవర్నర్ రమేశ్ బైస్ ఢిల్లీలో పర్యటనలో ఉండగా, మధ్యాహ్నం రాంచీకి చేరుకుని ఈసీ నివేదికను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల చట్టంలోని నిబంధనలు ఈ కేసులో వర్తించవని ఆగస్టు 12న సీఎం న్యాయవాద బృందం ఎన్నికల కమిషన్ ముందు వాదించింది. కాగా ఈసీ నివేదిక, గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =