ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌: కాంస్య పతకాలు గెలిచిన వినేష్ ఫోగట్, బజరంగ్ లకు ప్రధాని మోదీ అభినందనలు

World Wrestling Championship PM Modi congratulates Vinesh Phogat Bajrang for winning bronze medals, World Wrestling Championship, WWC , PM Modi Congratulates Wrestlers, PM Modi Congratulates Vinesh Phogat , PM Modi Congratulates Bajrang, Vinesh Phogat Wins Bronze Medal, Mango News, Mango News Telugu, PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates, Vinesh Phogat , Bajrang, Bajrang Wins Bronze Medal, Vinesh Phogat And Bajrang Won WWC Bronze Medals

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్-2022 సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో మహిళల 53 కేజీల విభాగంలో భారత్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంస్య పతకం గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్ ఫోగట్ నిలిచింది. అలాగే మరో భారత్ రెజ్లర్ బజరంగ్ పునియా పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బజరంగ్‌ కు ఇది 4వ పతకం. 2018లో రజతం, 2013లో కాంస్యం, 2019లో కాంస్యం, తాజాగా 2022లో కాంస్యం సొంతం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో బెల్‌గ్రేడ్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను గెలుచుకున్నందుకు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “మన రెజ్లర్లు మనకు గర్వకారణం. బెల్‌గ్రేడ్‌లోని ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియాలకు అభినందనలు. వినేష్ ఈ ప్లాట్‌ఫారమ్‌పై 2 పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలవడం మరియు బజరంగ్ 4వ పతకం గెలుచుకోవడంతో ఇద్దరికీ ఇది ప్రత్యేకంగా ఉంటుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =