కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటన

Karnataka Govt Makes Masks Mandatory to Celebrate the New Year in Pubs Restaurants Bars,New Covid Guidelines In Karnataka 2022,Number Of Corona Cases In Karnataka In Last 24 Hours,Number Of Covid Cases In Bangalore In Last 24 Hours,Mango News,Mango News Telugu,Bbmp Covid Guidelines,Karnataka Government Orders Today,Karnataka Government Covid Circulars,Active Cases In Karnataka Today,Karnataka Govt Covid Guidelines For International Travel,Karnataka Govt Covid Guidelines For Domestic Flights,Karnataka Govt Covid Guidelines 2022,Govt Of Karnataka Covid Lockdown Guidelines,Karnataka Govt Covid Treatment Guidelines,Government Of Karnataka Covid Guidelines,Karnataka State Govt Covid Guidelines,Karnataka Covid Cases Today Bangalore,Karnataka Covid Cases Yesterday,Karnataka Covid Cases District Wise,Karnataka Covid Cases Lockdown,Karnataka Covid Cases Twitter,Karnataka Covid Cases Today District Wise,Today Covid Cases In Karnataka,Total Karnataka Covid Cases,Karnataka District Wise Covid Cases,Karnataka Daily Covid Cases,Karnataka New Covid Cases,Karnataka Latest Covid Cases,How Much Covid Cases In Karnataka Today,Covid Cases In Karnataka As On Today

కరోనా నియంత్రణ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా పరిస్థితి, నియంత్రణ చర్యలపై కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో, సినిమా థియేటర్లలో మాస్క్‌లు తప్పనిసరి చేస్తునట్టు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యే వారికి మాస్క్‌లు తప్పనిసరి చేశారు. పబ్‌లు, రెస్టారెంట్స్, బార్‌ లలో నూతన సంవత్సరాన్ని జరుపుకొనేవారు తప్పకుండా మాస్క్‌లు ధరించాలన్నారు. అలాగే రెస్టారెంట్లు, బార్‌ లు, పబ్బుల్లో పార్టీలు జనవరి 1 అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కొనసాగడానికి అనుమతించబడతాయన్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు సీనియర్ సిటిజన్లు పార్టీలు లేదా డిన్నర్ కోసం రిసార్ట్‌లు/హోటల్‌లలోకి అనుమతించబడరని చెప్పారు.

బెంగళూరు మరియు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే 2 శాతం అంతర్జాతీయ ప్రయాణీకులను కోవిడ్ కోసం పరీక్షించడంతో పాటు, సిటీ వ్యాల్యూ 25 శాతం కంటే తక్కువ ఉన్న కేసుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నామని ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ చెప్పారు. బెంగుళూరులోని బోరింగ్ హాస్పిటల్ మరియు మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్ రోగలక్షణ వ్యక్తులను క్వారంటైన్ చేయడానికి నియమించబడిన ఆసుపత్రులుగా గుర్తించబడ్డాయన్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కవరేజీని వీలైనంత త్వరగా 50 శాతంకు పెంచడంతోపాటు మూడో డోస్‌ను అందరికీ అందజేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కోవిడ్ పై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే చాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా కోవిడ్‌పై ఈ పోరాటంలో ప్రభుత్వంతో చేతులు కలపాలని ప్రజలకు ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =