ఏపీలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పటినుంచంటే?

AP Inter Board Releases Timetable for Intermediate Public Exams 2023,Intermediate Exams In Telangana 2023 Schedule,Ap Intermediate Exam Time Table 2023,Inter 1St Year Final Exam Time Table 2023 In Ap,Mango News,Mango News Telugu,Ap Inter Exams 2023,Ts Intermediate 2Nd Year Exam Time Table 2023,Intermediate Exams In Telangana 2022 Schedule,Inter 2Nd Year Exam Time Table 2023 Ap,Inter 1St Year Final Exam Time Table 2022,Inter 1St Year Exams In Telangana 2023,Intermediate Public Examination 2023,Intermediate Public Exam,Intermediate Public Examination 2023 Results,Intermediate Exam Pattern 2023,Intermediate Exam Pattern,Intermediate Public Examination,Inter Public Exams 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు-2023 షెడ్యూల్‌ విడుదలైంది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించనున్నారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 22వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు ఫిబ్రవరి 24న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 15: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • మార్చి 17: ఇంగ్లీష్ పేపర్-1
  • మార్చి 20: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
  • మార్చి 23: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మార్చి 25: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మార్చి 28: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
  • మార్చి 31: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • ఏప్రిల్ 3: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 16: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • మార్చి 18: ఇంగ్లీష్ పేపర్ -2
  • మార్చి 21: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
  • మార్చి 24: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మార్చి 27: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మార్చి 29: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
  • ఏప్రిల్ 1: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • ఏప్రిల్ 4: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =