దేశంలో స్పుత్నిక్‌-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర వివరాలు ఇవే…

Imported Doses of Sputnik V COVID-19 Vaccine Priced at Rs 995.40 Per Dose - Dr Reddy's,Mango News,Mango News Telugu,COVID-19 Vaccine,Sputnik V Imported Doses Prices,Sputnik Roll Out Begins,Sputnik To Cost Rs 995 Per Dose,Sputnik Covid-19 Vaccine,Sputnik V Imported Doses Priced At Rs 995.40 Per Dose,Dr Reddy's,Dr Reddy's Administers 1St Dose Of Sputnik,Covid-19 Vaccine Sputnik V Imported Doses,Imported Sputnik V Covid Vaccine To Cost Rs 995,Dr Reddy's Launches Sputnik V In India At Rs 995,Covid-19 India,India Gets Third Vaccine, Sputnik V Launched At Rs 995 Per Dose,Sputnik V arrives in market,Imported Sputnik V vaccine to cost ₹995.40 per Dose,Sputnik V COVID-19 Vaccine,Sputnik V COVID-19 Vaccine Price

రష్యా ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ఇటీవలే మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పుత్నిక్‌-వీ ఒక్కో డోసు ధరను రూ.995.40 (5 శాతం జీఎస్టీ కలుపుకుని) గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రకటించింది. దిగుమతి చేసుకున్న స్పుత్నిక్‌-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ప్రసుతం రూ.948+ 5 శాతం జీఎస్టీతో కలిపి రూ.995.40 గా నిర్ణయించామని, అయితే స్థానికంగా దేశంలో తయారుచేసి, సరఫరా ప్రారంభమైనప్పుడు తక్కువ ధర లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో స్పుత్నిక్-వీ సాఫ్ట్ లాంచ్‌లో భాగంగా మొదటి డోసును శుక్రవారం నాడు హైదరాబాద్‌ లో ప్రారంభించారు. ఇక వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ మార్కెట్‌లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం నాడు ప్రకటించింది.

ముందుగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో ఉత్పత్తి, అమ్మకాలపై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో పేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ యొక్క అత్యవసర ఉపయోగం కోసం డాక్టర్ రెడ్డీస్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలన చేసి ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం డీసీజీఐకి సిఫార్సు చేసింది. అనంతరం డీసీజీఐ కూడా ఆమోదం తెలపడంతో దేశంలో వినియోగం కోసం ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్-వీ నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 13 =