ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కోవిడ్ మాక్ డ్రిల్‌.. సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా

Union Health Minister Mansukh Mandaviya Reviews Covid Mock Drill at Safdarjung Hospital, Mansukh Mandaviya Delhi Today,Mango News, Mango News Telugu, Union Health Minister Mansukh Mandaviya, Union Health Minister Mansukh Mandaviya Reviews on Covid Mock Drill, mansukh mandaviya on covid cases,safdarjung hospital,mansukh mandaviya news, mock drill at all covid hospitals

దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఫోర్త్ వేవ్ రానుందన్న అంచనాల మధ్య ఆస్పత్రులలో ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధత కోసం కేంద్రం మంగళవారం కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈరోజు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం మాండవియా మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రులలో ప్రజలకు సరైన చికిత్స అందేలా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ దేశంలో కోవిడ్ కేసులు పెరిగితే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు దేశం యొక్క కార్యాచరణ సంసిద్ధతకు సహాయపడతాయని, ఎక్కడైనా సరిచేసుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగడానికి సహాయపడతాయని తెలిపారు.

ఇక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిఎల్ షేర్వాల్ దీనిపై స్పందిస్తూ.. ఆరోగ్య మంత్రి ఈరోజు ఆసుపత్రిని సందర్శించారని, కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 44 పడకల సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని షేర్వాల్ చెప్పారు. కోవిడ్ పరీక్ష నుండి చికిత్స వరకు రోగులకు అవసరమైన అన్ని సేవలను ఇక్కడ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రులలో ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహిస్తున్నారు. తద్వారా ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ ఐసొలేషన్ రూమ్స్, పడకలు మరియు మానవ వనరుల పరంగా ఆసుపత్రుల సన్నద్ధత స్థాయిని తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్‌లు ఉద్దేశించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =