సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే: సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.

PM Modi Extends Best Wishes to CISF Personnel and their Families on the 54th Raising Day of CISF, PM Modi Extends Best Wishes to CISF,CISF Personnel and their Families,54th Raising Day of CISF,Mango News,Mango News Telugu,CISF Raising Day 2023,PM Modi expresses gratitude,PM Modi greets CISF,PM greets CISF personnel,Prime Minister Modi lauds CISF,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates,Indian Political News, National Political News, Latest Indian Political News

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందరికీ వారి రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మన భద్రతా యంత్రాంగంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్రను కలిగి ఉంది. వారు క్లిష్టమైన మరియు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రదేశాలలో 24 గంటల్లో భద్రతను అందిస్తారు. ఈ దళం కష్టపడి పని చేయడం మరియు వృత్తిపరమైన దృక్పథానికి ప్రసిద్ధి చెందింది” అని పేర్కొన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వారి రైజింగ్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం యొక్క క్లిష్టమైన మౌలిక సదుపాయాలు మరియు బహిరంగ ప్రదేశాలను సురక్షితం చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు నమస్కరిస్తున్నానని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

ముందుగా పార్లమెంట్ చట్టం ప్రకారం 1969 మార్చి 10న సీఐఎస్ఎఫ్ కొన్ని బెటాలియన్లతో స్థాపించబడింది. ఈ దళం కాలక్రమేణా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మరియు సూచనలతో మల్టీ ఫంక్షనల్ సెక్యూరిటీ ఫోర్స్‌గా మారింది. అనంతరం జాతీయ భద్రతను పరిరక్షించడంలో ఈ దళం యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తూ 2017లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బలాన్ని 1,45,000 నుండి 180,000కి పెంచారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ 1970 నుండి దేశానికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ 110 సంస్థలకు ఫైర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. 2022-23లో సీఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ 2567 అగ్నిమాపక కాల్స్ కు స్పందించిందని, తద్వారా 137.88 కోట్ల విలువైన ఆస్తిని మరియు 18 ప్రాణాలను కాపాడిందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 20 =