దేశంలో వరుసగా ఆరు నెలల పాటు రూ 1.4 లక్షల కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు, ఆగస్టులో ఎంతంటే?

Rs 143612Cr GST Revenue Collected in August 2022 GST Revenue More than Rs 1.4 Lakh Cr for 6 Months in a Row, Rs 143612Cr GST Revenue In August, GST Revenue Rs 1.4 Lakh Cr, 6 Months GST Revenue, Mango News, Mango News Telugu, Indian GST Revenue, August 2022 GST Revenue , Goods and Service Tax, GST Latest News And Updates, GST Revenue News And Live Updates, India GST, August GST Collections

దేశంలో వరుసగా ఆరు నెలల పాటు రూ.1.4 లక్షల కోట్లకుపైగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు అయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై,ఆగస్టు నెలల్లో వరుసగా రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. మరోవైపు ఆగస్టు 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు ఆగస్టు 2021 కంటే 28% ఎక్కువని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 57% ఎక్కువగా ఉన్నాయని మరియు దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 19% ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

ఆగస్టులో సీజీఎస్టీ వసూళ్లు రూ.24,710 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.30,951 కోట్లు, ఐజీఎస్టీ రూ.77,782 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.42,067కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ. 10,168 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.1,018 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.29,524 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.25,119 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఆగస్టు 2022 నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.54,234 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.56,070 కోట్లుగా ఉంది.

గతఏడాది (2021)తో పోలిస్తే ఏపీలో 47%, తెలంగాణలో 33% పెరుగుదల:

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లతో (రూ.2,591 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో (రూ.3,173 కోట్లు) 22 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2021 ఆగస్టులో రూ.3,526 కోట్లు వసూలు కాగా, 2022 ఆగస్టులో 10 శాతం పెరుగుదలతో రూ.3,871 కోట్లు వసూలు అయ్యాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =