వీర్ సావర్కర్ మా దేవుడు.. ఆయనను అవమానిస్తే సహించేది లేదు – రాహుల్ గాంధీకి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక

Maharashtra Former CM Uddhav Thackeray Warns Congress Leader Rahul Gandhi Over Comments on Veer Savarkar,Maharashtra Former CM Uddhav Thackeray,CM Uddhav Thackeray Warns Rahul Gandhi,Congress Leader Rahul Gandhi,Rahul Gandhi Over Comments on Veer Savarkar,Mango News,Mango News Telugu,Uddhav Thackerays Warning To Rahul Gandhi,Demeaning Savarkar Would Create Cracks,Wont Tolerate Any Insult To Veer Savarkar,CM Uddhav Thackeray Latest News,CM Uddhav Thackeray on Veer Savarkar News Today,Rahul Gandhi News Updates

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో తరచూ హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌ను అవమానించడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ వర్గం) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘వీర్ సావర్కర్ మా ఆరాధ్యదైవం. సావర్కర్ మా విశ్వాసానికి సంబంధించినవాడు. అలాగే సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ సెల్యులార్ జైల్లో ఎంతో చిత్రవధను అనుభవించారు. మనందరి కోసం ఆయన చేసిన త్యాగం యొక్క విలువను మనం గుర్తించాలి కానీ తగ్గించకూడదు. కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన సావర్కర్‌ను అవమానిస్తే సహించం. అతడిని అవమానించడాన్ని మేము సహించలేము’ అని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు. సావర్కర్ పడిన బాధలు, త్యాగాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని, లేదంటే ఈ చర్య బీజేపీని వ్యతిరేకించే విపక్ష కూటమిలో విభేదాలు సృష్టిస్తుందని రాహుల్ గాంధీని హెచ్చరించారు. బీజేపీ నేతలు రెచ్చగొడుతుంటారు, వాటికి బదులిచ్చే క్రమంలో సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడటం మరింత వివాదాన్ని కలిగిస్తుందని రాహుల్ గుర్తించాలి అని సూచించారు.

ఇక ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ త్వరలోనే రాహుల్‌ను కలుస్తానని, ఆయన ప్రసంగాలు మరియు విలేకరుల సమావేశాలలో సావర్కర్ ప్రస్తావన రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సావర్కర్ గురించి ప్రస్తావిస్తూ ‘మాఫీవీర్’ వంటి పదాలను ఉపయోగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ విధంగా సావర్కర్ త్యాగాన్ని తక్కువ చేసి రాహుల్ గాంధీ తనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కూడా హాని చేస్తున్నారని గుర్తించాలని సూచించారు. అలాగే సావర్కర్‌ను అవమానించడం ద్వారా, ఆయన దేశం కోసం చేసిన త్యాగాన్ని ప్రశ్నించినట్లవుతుందని, ఇది హిందుత్వ సిద్ధాంతకర్తను గౌరవించే వారి మధ్య ద్వేషాన్ని సృష్టిస్తుందని గుర్తించాలని ఎంపీ రౌత్ కోరారు. రాహుల్ గాంధీ ఇకపై సావర్కర్‌ను అవమానించకుండా ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను అని సంజయ్ రౌత్ తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని కూడా చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =