చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుకై మంత్రి కేటీఆర్‌ పోస్ట్ కార్డ్ ఉద్యమం.. ప్రధాని మోదీకి ఎర్రబెల్లి సహా పలువురు మంత్రుల లేఖలు

Telangana Ministers KTR Errabelli and Others Letter to PM Modi Over GST Should be Abolished on Handloom and Textiles, Telangana Minister KTR, Telangana Minister Errabelli Dayakar Rao, Member of Telangana Legislative Assembly, KTR Minister for Municipal Administration & Urban Development, Mango News, Mango News Telugu, PM Modi Over GST Should be Abolished on Handloom and Textiles, PM Narendra Modi Latest News And Updates, KTR To Write To Pm Modi, KTR Writes to PM Modi, Abolish Gst On Handloom Textile, KTR Writes Postcard To PM Modi, Ktr Launches Online Petition Against Gst, GST News And Live Updates

తెలంగాణలో ఒకవైపు మునుగోడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, పురపాలక, చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాయాలని మంత్రి కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆన్‌లైన్‌ పిటిషన్‌ను ప్రారంభించి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘చేంజ్‌.ఆర్గ్‌’లో ఆన్‌లైన్‌ పిటిషన్‌పై ప్రతి ఒక్కరూ సంతకం చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ పిలుపుకు తెలంగాణ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర టీఆర్ఎస్ నేతలు పలువురు లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వహస్తాలతో ప్రధానికి రాసిన పోస్టు కార్డును ఈ రోజు పోస్టు చేశారు. ఇక దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ సహా పలువురు నేత కార్మికులు ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డు రాశారు. అలాగే ఆసు యంత్రం రూపకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు కూడా ప్రధానికి లేఖలు రాశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =