భారతీయ జనతా పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్

2021 Kerala Assembly election, 2021 Kerala Legislative Assembly election, bjp, E Sreedharan Joins in BJP, Kerala, Kerala Assembly elections, Kerala Political News, Kerala Politics, Mallapuram, Mango News, Metro Man E Sreedharan, Metro Man E Sreedharan Formally Joins BJP, Metro Man E Sreedharan Joins in BJP, Metro Man E Sreedharan Joins in BJP at Mallapuram

దేశంలో మెట్రో మ్యాన్ గా పిలవబడే ప్రముఖ ఇంజనీర్ శ్రీధ‌ర‌న్ బీజేపీ పార్టీలో చేరబోతున్నాయని, కేరళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25, గురువారం రాత్రి కేరళలోని మలప్పురంలో ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ నేతృత్వంలో జరుగుతున్నకేరళ విజయ యాత్ర సందర్భంగా మలప్పురంలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో శ్రీధరన్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధరన్ ను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

అనంతరం శ్రీధరన్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరడం తన జీవితంలో గొప్ప సందర్భాలలో ఒకటని పేర్కొన్నారు. పదవీ విరమణ అప్పటినుండి గత 10 సంవత్సరాలుగా కేరళలో నివసిస్తున్నానని, వేర్వేరు ప్రభుత్వాలను చూశాను కానీ వారు ప్రజల కోసం చేయగలిగిన స్థాయిలో చేయడం లేదని అన్నారు. తన అనుభవంతో తగిన కృషి చేసేందుకే బీజేపీలో చేరుతునట్టు చెప్పారు. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో బీజేపీలో శ్రీధరన్ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు డిసెంబర్ 31, 2011 న ఢిల్లీ మెట్రో చీఫ్‌ గా శ్రీధరన్ పదవీవిరమణ చేశారు. జైపూర్, లక్నో, కొచ్చి వంటి ఇతర మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన కీలక సేవలు అందించారు. భారత్ ప్రభుత్వం నుంచి 2008 లో పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =