కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్

CS Somesh Kumar Meeting Over GST Tax Collections, GST Tax Collections, Mango News, Somesh Kumar, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar Co-ordination Meeting Over GST Tax Collections, Telangana CS Somesh Kumar Meeting, Telangana CS Somesh Kumar Meeting Over GST Tax Collections, Telangana CS Somesh Kumar Over GST Tax Collections, Telangana GST Tax Collections

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో సమన్వయ సమావేశం శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగింది. ఈ అంశంలో మరింత సమన్వయం, పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించడానికి రెగ్యులర్ గా ప్రతివారం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యేక కమిటీలతో ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్ లను చేపట్టామన్నారు. అలాగే ఎటువంటి సమస్యలు లేకుండా పన్ను వసూళ్లు చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయుటకు పరస్పర సహకారం అందించుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీజీఎస్టీ హైదరాబాద్ ఛీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా, స్టేట్ ట్యాక్స్ కమీషనర్ నీతూ కుమారి ప్రసాద్, సీజీఎస్టీ హైదరాబాద్ ప్రిన్సిపల్ కమీషనర్ పురుషోత్తం, సీజీఎస్టీ మేడ్చల్ కమీషనర్ శ్రీధర్, సికింద్రాబాద్ అండ్ రంగారెడ్డి కమీషనర్ యం.ఆర్.ఆర్.రెడ్డి మరియు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =