రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా, ఆకాశ్ అంబానీకి చైర్మన్ గా బాధ్యతలు

Mukesh Ambani Resigns as Reliance Jio Board Director Akash Ambani Appointed as Chairman, Mukesh Ambani Resigns as Reliance Jio Board Director, Akash Ambani Appointed as Chairman Of Reliance Jio Board Director, Reliance Jio Board Director, Ambani Resigns as Reliance Jio Board Director, Jio Board Director, Akash Ambani Named Reliance Jio Chairman, Mukesh Ambani resigns from Reliance Jio Chairman, Mukesh Ambani resigns from Reliance Jio Board Director, Reliance Jio board announced Akash Ambani as the board's new chairman, Mukesh Ambani, Akash Ambani, Reliance Jio, Reliance Jio Chairman News, Reliance Jio Chairman Latest News, Reliance Jio Chairman Latest Updates, Reliance Jio Chairman Live Updates, Mango News, Mango News Telugu,

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ సంస్థ టెలికాం విభాగం అయిన రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని చైర్మన్ గా నియమించి, ఈ కంపెనీ పగ్గాలను అప్పగించారు. ఈ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థ వెల్లడించింది. జూన్ 27, సోమవారం జరిగిన సమావేశంలో జియో సంస్థ బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్‌ గా ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న ఆకాశ్ అంబానీ నియామకాన్ని సంస్థ బోర్డు ఆమోదించిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఐదేళ్ల కాలానికి జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు.

అలాగే జియో స్వతంత్ర డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను నియమించినట్టు తెలిపారు. కాగా రిలయన్స్ జియోతో పాటుగా ఇతర జియో డిజిటల్ సేవల బ్రాండ్‌ తో కూడిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌ గా ముకేశ్ అంబానీనే కొనసాగనున్నారు. గత కొంత కాలంగా ముకేశ్ అంబానీ తన వ్యాపారాలను వారసులకు అప్పగించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో బోర్డు చైర్మన్ గా ఆకాశ్ అంబానీ నియామకం జరిగినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here