ఐపీఎల్-2022: మిగిలిన మ్యాచులకు దూరమైన ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్

Mumbai Indians Batter Suryakumar Yadav Ruled Out of IPL 2022 owing to Left Forearm Muscle Injury, Suryakumar Yadav Ruled Out of IPL 2022 owing to Left Forearm Muscle Injury, Mumbai Indians Batter Suryakumar Yadav Ruled Out of IPL 2022, owing to Left Forearm Muscle Injury, Left Forearm Muscle Injury, Suryakumar Yadav Ruled Out of IPL 2022 Due To Left Forearm Muscle Injury, Mumbai Indians Batter Ruled Out of IPL 2022, Mumbai Indians Batter Suryakumar Yadav, IPL-2022, 2022 IPL, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 లీగ్ మ్యాచ్‌లు మే 22వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో గాయాలతో పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎడమ ముంజేయి కండరాల గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ముంబయి జట్టు ఆడే మిగతా మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడు. ఈ మేరకు ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. మే 6న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడని తెలిపారు.

సూర్య కుమార్ ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 43.29 సగటుతో 303 పరుగులు చేయగా, అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్ 2022లో ముంబయి జట్టు అంచనాలకు తగినట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన ముంబయి జట్టు, రెండు విజయాలు సాధించగా, ఎనిమిది మ్యాచుల్లో పరాజయం పాలయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here