ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ : మే నెలకు ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, కేథరిన్​ బ్రైస్ ఎంపిక

Bangladesh’s Mushfiqur Rahim, ICC Player of the Month, ICC Player of the Month Award, ICC Player of the Month Awards, ICC Player of the Month Awards for May 2021, ICC Players of the Month, Kathryn Bryce, Kathryn Bryce Voted As ICC Players Of The Month, Mango News, Mushfiqur Rahim, Mushfiqur Rahim and Kathryn Bryce won ICC Player of the Month Awards for May 2021, Mushfiqur Rahim named ICC Players, Scotland’s Kathryn Bryce

అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగంలో ఈ అవార్డును ఇస్తున్నారు. అందులో భాగంగా మే నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును బంగ్లాదేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ గెలుచుకున్నాడు. మే నెలలో శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ సహాయంతో 237 పరుగులు చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ అవార్డ్‌ రేసులో శ్రీలంక బౌలర్ ప్రవీణ్ జయవిక్రమ, పాకిస్తాన్ బౌలర్ హాసన్ అలీ ఉన్నప్పటికీ ఓటింగ్‌లో ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌ ముందంజలో ఉండి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మరోవైపు మే నెలకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును స్కాట్లాండ్ మహిళ క్రికెటర్​ కేథరిన్​ బ్రైస్​ గెలుచుకున్నారు. ఓటింగ్ లో గాబి లెవీస్ (ఐర్లాండ్), లేహ్ పాల్ (ఐర్లాండ్) కంటే ముందంజలో నిలిచి ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here