శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ద‌నుష్క గుణ‌తిల‌క‌పై స‌స్పెన్షన్ విధింపు, ఎందుకంటే?

Sri Lanka Cricket Board Suspends Danushka Gunathilaka From All Formats of Cricket,Sri Lanka Cricket Board ,Danushka Gunathilaka Suspended,Sri Lanka Cricket Board Suspends Danushka,Mango News,Mango News Telugu,Sri Lanka Cricket Board Danushka Gunathilaka ,Danushka Gunathilaka Suspended From All Formats,Danushka Gunathilaka Suspended, Danushka Gunathilaka Latest News And Updates,International Cricket Board,ICC Latest News And Updates

శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల క్రికెట్ నుండి దనుష్క గుణతిలకను సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ క‌మిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం ఉదయం సిడ్నీలో 29 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై దనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఘ‌ట‌న గురించి పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. ఒక‌వేళ విచార‌ణలో కనుక ద‌నుష్క దోషిగా తేలితే, అతనిపై చ‌ట్టం ప్ర‌కారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే దీనిపై నిష్పక్షపాత విచారణను నిర్వహించడానికి ఆస్ట్రేలియన్ చట్ట-నిర్వహణ సంస్థలకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

ఒక శ్రీలంక క్రికెట్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, ఆస్ట్రేలియాలో కోర్టు కేసు ముగిసిన తర్వాత నేరం రుజువైతే దనుష్కకు జరిమానా విధించనున్నట్లు కూడా ప్రకటించింది. ఇక ఈ టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన ఈ 31 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్, ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సెమీస్ చేరలేకపోయిన శ్రీలంక దనుష్క లేకుండానే మిగిలిన బృందంతో స్వదేశానికి తిరిగి వచ్చింది. కాగా ద‌నుష్క గుణ‌తిల‌క‌ ఇప్పటివరకు శ్రీలంక తరపున ఎనిమిది టెస్టులు, 47 వన్డేలు సహా 46 టీ20లు ఆడాడు. డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన ఓ మహిళపై దనుష్క లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు అందడంతో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ స్టేట్ పోలీసులు ఆదివారం క్రికెట‌ర్ ద‌నుష్క‌ను అరెస్టు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =