తొమ్మిదేళ్లలో బయటపడ్డ 250 మిలియన్ల మంది

Niti Aayog Says that Poverty will Decrease,Niti Aayog Says that Poverty,Poverty will Decrease,Niti Aayog on Poverty,NITI Aayog ,Niti Aayog says poverty decrease, 250 million people who survived in 9 years,250 million people escaped,Mango News,Mango News Telugu,Claims on Poverty Reduction,Indians escape Multidimensional Poverty,Niti Aayog Latest News,Niti Aayog Live Updates
NITI Aayog ,Niti Aayog says that poverty will decrease, 250 million people who survived in 9 years

తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తాజాగా నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 తో పోల్చితే 2022-23 మధ్య  తొమ్మిదేళ్లలో దాదాపు 250 మిలియన్ల మంది పేదరికం నుంచి తప్పించుకున్నట్లు నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో పేదరికంలో అత్యధిక క్షీణత నమోదవడంపై హర్షం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లలో 248.2 మిలియన్ల మంది బహుమితీయ పేదరికం నుంచి తప్పించుకున్నట్లు తెలిపిన నీతి ఆయోగ్..ప్రతి సంవత్సరం 27.5 మిలియన్ల మంది బహుమితీయ పేదరికం నుంచి తప్పించుకుంటున్నట్లు వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు కూడా దీని వెనుక ఉన్నట్లు అభిప్రాయపడిన నీతి ఆయోగ్.. ఈ అద్భుతమైన విజయాన్ని అందించడానికి మోడీ సర్కార్ కారణం అయ్యారన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. దీనిపై   నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం సమక్షంలో తాజాగా  నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్  ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆక్స్‌ఫర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించిన సాంకేతిక ఇన్‌పుట్‌లను అందించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 7 =