లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతానంటున్న గులాబీ బాస్

KCR has been in Public Since his Birthday,KCR has been in Public,KCR Since his Birthday,Brs, Congress, Kcr, Kcr Public, Loksabha,KTR ,Telangana Bhavan, KCR Birthday,Lok Sabha Elections,Mango News,Mango News Telugu,Kcr Latest News And Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,KCR in Public Latest News
Brs, Congress, Kcr, Kcr Public, Loksabha, Telangana Politics,KTR ,Telangana Bhavan, KCR Birthday,Lok Sabha Elections

అసలే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం.. గోరుచుట్టుమీద రోకటి పోటులా వెంటనే  ఫామ్ హౌజ్‌లో కాలు జారిపడటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. విశ్రాంతికే పరిమితం అయ్యారు.  ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌‌లో కేసీఆర్‌ కాలు జారిపడిపోవడంతో.. డాక్టర్లు ఆయనకు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో..జనాల్లోకి రావడం లేదు.పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.

మరోవైపు లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయాయి. ఇటు జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లపై  పైచేయి సాధించడానికి బీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్లాన్ లు వేస్తోంది.  అయితే ఇలాంటి సమయంలో..మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రంగంలోకి దిగకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.కేసీఆర్ జనాల్లోకి రాకపోవడంతో పార్టీకి పెద్ద మైనస్ అని నాయకులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆలస్యం అవుతుందని బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్ కూడా అనుకోవడంతో.. ఫిబ్రవరి నెలలో జనాల్లోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. లోక్ సభ ఎలక్షన్స్‌లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా చేసుకుని.. కేసీఆర్ పర్యటనలు ఉండబోతున్నాయట .

వచ్చే నెల ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా  నిర్వహించడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. అదే రోజు కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రానున్నట్లు తెలుస్తోంది.  కేసీఆర్ తన హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత  నంది నగర్‌లోని తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీలోని అన్ని కార్యక్రమాలను తనయుడు కేటీఆర్, మేనల్లుడు  హరీశ్ రావు దగ్గరుండి చూసుకుంటున్నారు.

మరోవైపు పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ సూచనలతో అన్ని లోక్ సభ నియోజకవర్గల్లోనూ పర్యటిస్తూ , సమీక్షలు నిర్వహిస్తూ,  పార్టీ శ్రేణులకు కేటీఆర్ తగిన సూచనలు చేస్తున్నారు. అయితే  వచ్చే నెల నుంచి పొలిటికల్ సర్కిల్ లోకి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారన్న వార్త ఇప్పుడు వినిపించడంతో బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =