పద్మ అవార్డుల దరఖాస్తులకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా ప్రకటన

Padma Awards-2023 Last Date for Nominations is 15th September, last date for nominations for Padma Awards is 15th September 2022, Nominations For 2023 Padma Awards Open Till 15th September, Nominations for Padma Awards 2023 open till Sep 15, Padma Awards-2023 Nominations Last Date is 15th September, Padma Awards-2023 Nominations, last date for nominations for Padma Awards is 15th September 2022, Padma Awards-2023 2023 Padma Awards, nominations for Padma Awards-2023, Padma Awards 2023 Nominations, Padma Awards Nominations, Padma Awards, Padma Awards Nominations News, Padma Awards Nominations Latest News, Padma Awards Nominations Latest Updates, Padma Awards Nominations Live Updates, Mango News, Mango News Telugu,

2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2023 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ మే 1, 2022వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల నామినేషన్ల స్వీక‌ర‌ణకు సెప్టెంబర్ 15, 2022 ను చివరి తేదీగా ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జాతీయ అవార్డుల పోర్టల్ https://awards.gov.inలో మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలను అందిస్తున్నారు. క‌ళ‌లు, సాహిత్యం, విద్య‌, క్రీడ‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సాంకేతిక మరియు ఇంజినీరింగ్, ప్ర‌జా వ్య‌వ‌హారాలు‌, ప్ర‌జాసేవ, వాణిజ్యం మరియు పరిశ్రమ మొదలైన రంగాలు లేదా విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు. 1954లో స్థాపించబడిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. అయితే వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మినహా పీఎస్యూలలో పనిచేస్తున్న ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులు అంతా పద్మ అవార్డులకు అర్హులు కాదని పేర్కొన్నారు. పద్మ అవార్డులను “ప్రజల పద్మ”గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాబట్టి పౌరులందరూ స్వీయ నామినేషన్‌ తో సహా నామినేషన్లు/సిఫార్సులు చేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =