నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ విడుదల

Gang Leader First Look, Gang Leader First Look Out Now, Gang Leader First Look Poster, Gang Leader First Look Unveiled, Gang Leader Movie Latest News, Gang Leader Movie Latest Updates, Mango News, Nani Gang Leader First Look Details, Nani Gang Leader First Look Out Now, Nani Starrer Gang Leader First Look, Nani Starrer Gang Leader First Look unveiled

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నేచురల్‌ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. జులై 13 న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోగా జులై 15 న ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. రివెంజర్స్ అసెంబుల్ అంటూ చిత్ర కథ, కథనాలపై ఒక సూచన చేసారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని నాని విడుదల చేశారు. పోస్టర్ లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నాని తో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ తో ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రివీల్ చేశారు. కథానుగుణంగా ఉన్న ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం లో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =