విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా, తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం

2GB Free Data per a Day to Over 9 Lakh Students, free data card for online classes, Mango News, Tamil Nadu govt orders internet via data cards, Tamilnadu, Tamilnadu Govt, Tamilnadu Govt Decides to Provide 2GB Free Data per a Day, Tamilnadu Govt Provide 2GB Free Data to 9 Lakh Students, Tamilnadu Govt Provide Free Data to Students, Tamilnadu Latest News, Tamilnadu News, TN college students to get free data card

తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న కాలేజ్ విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు సీఎం పళని స్వామి ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఈ పథకం జనవరి నెల నుండి ఏప్రిల్ నెల వరకు అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో పాలిటెక్నీక్ సహా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, ఇతర కోర్సులు చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులు లబ్ది చేకూరనుంది. విద్యార్థుల కోసం డేటా కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందించబడతాయని ప్రభుత్వం పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =