పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Budget Session 2020, Finance Minister of India, national news headlines today, Nirmala Sitharaman, Parliament Budget Session, Parliament Budget Session Live Updates, President Kovind Speech, President Ram Nath Kovind, Union Budget Session, Union Budget Session 2020

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31, శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సి ఉందని, ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం దేశాన్ని సరికొత్త దిశగా నడపడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలను గ్రామాలకు కూడా విస్తరించాలని అన్నారు. నిరసనలు, హింస వైపు అడుగులేయడం వలన దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌35ఏ రద్దు బిల్లు లోక్ సభ, రాజ్యసభ లలో మూడొంతుల మెజార్టీతో ఆమోదం పొందడం చారిత్రాత్మక విషయమని చెప్పారు 
  • పౌరసత్వ సవరణ చట్టం కూడా చారిత్రాత్మక చట్టం, సీఏఏ అమల్లోకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ కలను నిజం చేసింది
  • వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశ ప్రజలు ఐక్యత ఏంతో హర్షణీయం
  • ట్రిపుల్‌ తలాక్‌ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగింది
  • ట్రాన్స్‌ జెండర్‌ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
  • ఉజ్వల్‌ యోజన, ఆయుష్మాన్‌ యోజన పథకాల ద్వారా కేంద్రప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోంది
  • కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను ఏర్పాటుచేసి కేంద్రం రికార్డు నెలకొల్పింది
  • దేశంలో 27వేల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు
  • భారత్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగింది
  • చంద్రయాన్‌-3కి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

[subscribe]

Video thumbnail
President Ram Nath Kovind Speaks About The Bills Passed In Last Session | Union Budget | Mango News
10:48
Video thumbnail
Opposition Obstructs President Ram Nath Kovind Speech In Parliament | #UnionBudget2020 | Mango News
11:19
Video thumbnail
President Ram Nath Kovind Says Modi's Govt Should Achieve More This Year | Union Budget | Mango News
17:23
Video thumbnail
PM Modi's Remarks At Beginning Of The Budget Session In Parliament | Union Budget 2020 | Mango News
03:30
Video thumbnail
Asaduddin Owaisi Says We Now Need To Raise The Slogans Of Quit BJP, Quit Modi & Quit Amit Shah
06:55
Video thumbnail
Asaduddin Owaisi - After I Die, No Power In The World Can Take My Love For India | Mango News
09:50
Video thumbnail
Governor Tamilisai Soundararajan Pays Homage To Mahatma Gandhi On His Commemoration Day | Mango News
03:10
Video thumbnail
Minister Harish Rao About KCR Letter To Centre Over Kaleshwaram & Mission Bhagiratha |Telangana News
02:52
Video thumbnail
KTR Gives Strong Assurance To Municipalities In Press Meet | Telangana Political News | Mango News
06:28
Video thumbnail
KTR Expresses His Happiness Over TRS Victory In Municipal Elections | Telangana News | Mango News
06:55
Video thumbnail
KTR Special Thanks To MIM Party For Supporting In Nizamabad | Telangana Political News | Mango News
08:12
Video thumbnail
CM KCR Congratulates Party President KTR In Press Meet | Telangana Municipal Election Results 2020
03:57
Video thumbnail
Only Congress Party Gives Strong Competition To TRS Party Says MP Revanth Reddy | Mango News
04:50
Video thumbnail
CM KCR Sensational Statements In Press Meet | Telangana Municipal Election Results 2020 | Mango News
04:02
Video thumbnail
CM KCR Rejects CAA In Telangana State | KCR Press Meet | Telangana Municipal Election Results 2020
11:55

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here