జూలై 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహణ?

Mango News, Monsoon Session of Parliament, Parliament, Parliament LIVE Updates, Parliament Monsoon Session, parliament monsoon session 2021, Parliament Monsoon Session Likely to Commence, Parliament Monsoon Session Likely to Commence From July 19, Parliament Monsoon Session Updates, parliament session, parliament session 2021, Parliament’s Monsoon Session, Rajya Sabha Monsoon session

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతుంది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. దాదాపు నెల రోజుల ఈ సెషన్‌లో మొత్తం 20 రోజుల పాటుగా సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కోసం ఉభయసభల్లో అన్ని కరోనా ప్రొటొకాల్స్ అనుసరించి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు కనీసం ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఈ సమావేశాలకు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా సమావేశాల నిర్వహణ, నిబంధనలపై ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here