పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు

PM Kisan Samman Nidhi Deadline for Completing eKYC Extended for All Beneficiaries till August 31st, Deadline for Completing PM Kisan Samman Nidhi eKYC Extended for All Beneficiaries till August 31st, PM Kisan Samman Nidhi eKYC Extended for All Beneficiaries till August 31st, eKYC deadline for all PM KISAN beneficiaries has been extended until August 31, PM Kisan eKYC deadline, PM Kisan Samman Nidhi, PM Kisan eKYC, PM Kisan Yojana, PMKISAN beneficiaries, Deadline of eKYC, PM Kisan eKYC Update, PM Kisan Samman Nidhi News, PM Kisan Samman Nidhi Latest News And Updates, PM Kisan Samman Nidhi Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు మార్చి 31, 2022 వరకు గడువు పెట్టగా, ఆ తర్వాత మే 31, 2022 వరకు, అనంతరం జూలై 31, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్రం ప్రకటించింది. ఇంకా దేశవ్యాప్తంగా కొంతమంది రైతులు ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉండడంతో పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు తాజాగా ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. ఆ వివరాలను పీఎం-కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

“పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎంకిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు. పీఎం-కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31, 2022 వరకు పొడిగించబడింది” అని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటివరకు పీఎం-కిసాన్ కింద 11వ విడతల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. కాగా పీఎం-కిసాన్ 12వ విడత నిధులు సెప్టెంబర్ 1వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

పీఎం-కిసాన్ కోసం ఈ-కేవైసీ ప్రక్రియ:

  • పీఎం కిసాన్ వెబ్ సైట్ ను http://pmkisan.nic.in/ని సందర్శించి, ఫార్మర్స్ కార్నర్ విభాగం కింద ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పేజీలో ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నెంబర్ కనిపించాక, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నంబర్‌ కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ ఆప్షన్ లో క్లిక్ చేసాక మొబైల్ నెంబర్ కు వచ్చిన మరో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + nineteen =