ఐసీసీ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగిన శశాంక్‌ మనోహర్‌

ICC Chairman, ICC Chairman Post, ICC Chairman Shashank Manohar, national news, Shashank Manohar, shashank manohar bcci, shashank manohar icc, Shashank Manohar Steps Down from ICC Chairman Post

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ వైదొలిగారు. జూలై 1, బుధవారం నాడు ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. 2015 నవంబర్ లో ఆయన ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2017 మార్చ్ లో ఆయన పదవీకాలం ముగియగా, ఐసీసీ చైర్మన్ గా కొత్తవారిని ఎన్నుకునే వరకు ఆయననే తిరిగి చైర్మన్‌గా నియమించాలని తీర్మానం చేయడంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా శశాంక్‌ మనోహర్ తప్పుకోవడంతో ఐసీసీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ ముగిసేంత వరకు డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాజా చైర్మన్‌ విధులు నిర్వర్తిస్తారని ఐసీసీ పేర్కొంది. మరోవైపు ఈసీబీ మాజీ చైర్మన్‌ కోలిన్‌ గ్రేవ్స్ లేదా ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =