గుజరాత్‌ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్‌ గధ్వీ, ప్రకటించిన కేజ్రీవాల్

Aam Admi Party Chief Arvind Kejriwal Announced Isudan Gadhvi as AAP’s Gujarat CM Candidate, Isudan Gadhvi as AAP’s Gujarat CM Candidate, Aam Admi Party Chief Arvind Kejriwal, Aam Admi Party’s Gujarat CM Candidate, Gujarat CM Candidate, Isudan Gadhvi, Aam Admi Party, Former journalist Isudan Gadhvi, former TV Anchor Isudan Gadhvi, Gujarat CM Candidate News, Gujarat CM Candidate Latest News And Updates, Gujarat CM Candidate Live Updates, Mango News, Mango News Telugu

ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గుజరాత్ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు చాలా కాలం క్రితమే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 3న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గుజరాత్ పై ఆప్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గుజరాత్​ ఎన్నికల్లో​ ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును శుక్రవారం ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్‌ జాతీయ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ, మాజీ జర్నలిస్టు ఇసుదాన్‌ గధ్వీని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నవంబర్ 3 సాయంత్రం వరకు ప్రజలు నుంచి అభిప్రాయాలను స్వీకరించి, వారి అభిప్రాయాల ఆధారంగా ఇసుదాన్‌ గధ్వీని ఎంపిక చేస్తునట్టు కేజ్రీవాల్ తెలిపారు.

అనంతరం ఇసుదాన్‌ గధ్వీ మాట్లాడుతూ, “దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నా గుజరాత్ ప్రజల బాధలను తగ్గించగలిగేలా దేవుడు నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రాజకీయాల్లోకి రావడం సామాన్యుడి హాబీ కాదు, బలవంతం. గుజరాత్ ప్రజల కష్టాలు చూడలేకపోయాను. రాజకీయాల్లోకి రావాలని అరవింద్ కేజ్రీవాల్ నాకు చెప్పారు. మీరు బయటి నుండి అవసరమైన విధంగా పనిని పూర్తి చేయలేరు అని చెప్పారు” అని పేర్కొన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రకటన అనంతరం ఇసుదాన్‌ గధ్వీ వేదికపై నుండి దిగి, తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మా ట్లాడుతూ, గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఒక గదిలో కూర్చొని నిర్ణయించలేదన్నారు. పంజాబ్ లో కూడా భగవంత్ మాన్‌ను సీఎంగా ఎన్నుకున్నది పంజాబ్ ప్రజలేనని, ఆప్ కాదని చెప్పారు. గుజరాత్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని భావిస్తున్నామని, దీంతో ఈ రోజు ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదని, తదుపరి గుజరాత్ ప్రభుత్వానికి సీఎంను ప్రకటిస్తున్నామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై గత వారం నుంచి ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించామని, మొత్తం 16,48,500 స్పందనలలో 73 శాతం మంది ఇసుదాన్‌ గధ్వీ ఎంపిక చేసుకున్నారని, అతన్నే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచే అరవింద్ కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించి, అక్కడ పలు పర్యటనలు చేపట్టారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి సహా పలు అంశాలపై అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 12 =