దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Dedicates to the Nation 35 PSA Oxygen Plants Established under PM CARES,Mango News,Mango News Telugu,PM Modi,PM Modi Updates,PM Narendra Modi,Modi,PM Modi Live,PM Modi Latest News,PM Modi Live Updates,PM Modi Speech,PM Modi Live News,PM Modi News,PM Modi Latest News,PM Modi Latest,PM Modi Latest Updates,PM Modi LIVE,PM Modi Live Updates,Modi Live,India Live News,Narendra Modi Inaugurates 35 PSA Oxygen Plants Established Under PM Cares Fund,PSA Oxygen Plants,Prime Minister Narendra Modi,PSA,PM Cares,PM Cares Fund,PSA,PSA Oxygen Plants E,PMO,Narendra Modi,Oxygen Plant,PM Modi Dedicates 35 PSA Oxygen Plants To The Nation,PM Modi Dedicates PSA Oxygen Plants Established Under PM Cares To The Nation,Prime Minister Of India,Pmo India,PM Narendra Modi Speech,PM Modi Speech Today,PM Narendra Modi Speech Latest,PM Modi Speech Latest,PM Modi Latest Speech,Modi Speech,India,Covid 19,PM Cares,PM Modi Dedicates To Nation 35 PSA Oxygen Plants,PM Modi Dedicates 35 PSA Oxygen Plants To Nation,35 PSA Oxygen Plants

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం కేర్స్ కింద ఏర్పాటు చేయబడ్డ 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని అన్ని జిల్లాలు ఇప్పుడు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించినట్లయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవియా, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు మరియు హెల్త్ కేర్ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిపై పోరాడటానికి దేశంలో తక్కువ సమయంలో అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలు మన దేశ సామర్థ్యాన్ని తెలుపుతాయన్నారు. ఈ మహమ్మారికి ముందు కేవలం 1 టెస్టింగ్ ల్యాబ్ నుండి నేడు సుమారు 3000 టెస్టింగ్ ల్యాబ్‌ల నెట్‌వర్క్ సృష్టించబడిందని చెప్పారు. అలాగే డిమాండ్ పెరగడంతో దేశంలో వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామన్నారు. ఇక అతి త్వరలోనే దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ లో భాగంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల అందించిన మార్కును దాటుబోతున్నామని చెప్పారు. 6,7 సంవత్సరాల క్రితం వరకు కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఎయిమ్స్ సౌకర్యం ఉండేదని, నేడు ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కళాశాల ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eight =