75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌, భారతీయ సినీ ప్రముఖులు

75th Cannes Film Festival 2022 Union Minister Anurag Thakur Along with Indian Celebrities Received Red Carpet, Union Minister Anurag Thakur Along with Indian Celebrities Received Red Carpet, 75th Cannes Film Festival 2022, Cannes Film Festival 2022, 2022 Cannes Film Festival, Indian Celebrities Received Red Carpet, Union Minister Anurag Thakur Received Red Carpet, Union Minister Anurag Thakur, Union Minister, Anurag Thakur, 75th Cannes Film Festival News, 75th Cannes Film Festival Latest News, 75th Cannes Film Festival Latest Updates, 75th Cannes Film Festival Live Updates, Mango News, Mango News Telugu,

75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రెడ్ కార్పెట్ అందుకున్నారు. ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ రివేరాలో భాగమైన కేన్స్‌ పట్టణంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఈ 75వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశానికి ప్రత్యేకంగా ‘గౌరవ సభ్య దేశం’ హోదా ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ చేరుకున్న కేంద్ర మంత్రికి ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ స్వాగతం పలికారు. భారత్ తరపున కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి రెడ్ కార్పెట్‌ స్వాగతం లభించింది. ఆయనతో పాటు తమిళ నటులు కమల్ హాసన్, మాధవన్, హిందీ ప్రముఖులు శేఖర్ కపూర్, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రికీ కేజ్, వాణీ త్రిపాఠి మరియు ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే తదితరులు ఉన్నారు.

ఈ సంవత్సరం, కేన్స్ ఫిల్మ్ మార్కెట్‌లో భారతదేశం నుండి ఆరు సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. వీటిలో.. రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ (హిందీ, ఇంగ్లీషు, తమిళం), గోదావరి (మరాఠీ), ఆల్ఫా బీటా గామా (హిందీ), బూంబా రైడ్ (మిషింగ్), ధుయిన్ (మైథిలి) మరియు నిరయే తథాకలుల్లా మారమ్ (మలయాళం) ఉన్నాయి. భారతీయ నటి దీపికా పదుకొణె ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో జ్యూరీలో భాగం కావడం విశేషం. జ్యూరీ సభ్యురాలిగా దీపికాకి అవకాశం లభించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలో దీపికా పదుకొణె బంగారు మరియు నలుపు చీరలో రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఊర్వశి రౌటేలా మరియు తమన్నా భాటియా కూడా తమ స్టైలిష్ బెస్ట్‌గా కనిపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =