రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Flags Off Rajasthans First Vande Bharat Express Train Today Which Travel Between Ajmer-Delhi,PM Modi Flags Off Rajasthans First Vande Bharat,Rajasthans First Vande Bharat Express Train,Vande Bharat Travel Between Ajmer-Delhi,Mango News,Mango News Telugu,PM Modi Flags Off Ajmer-Delhi Vande Bharat Train,Prime Minister Modi flags off Ajmer-Delhi Train,Narendra Modi Latest News and Updates,Rajasthan Vande Bharat Express News Today,Rajasthan Vande Bharat Express Latest News,Rajasthan Vande Bharat Express Live News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా ఊపారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేశారు.. ‘రైలు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఎపిసోడ్‌లో, ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఢిల్లీ కంటోన్మెంట్ నుండి అజ్మీర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేయడం విశేషం’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రాజస్థాన్‌లోని అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడువనుంది. అలాగే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ టెరిటరీలో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్ ప్యాసింజర్ రైలు కానుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఒక గంట ముందుగానే వందే భారత్ ప్రయాణం పూర్తి అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఇక ఈ క్రమంలో వందే భారత్ రైలు అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్, జైపూర్, అల్వార్, గురుగ్రామ్‌ తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్-అజ్మీర్ మధ్య దూరాన్ని 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుందని, దీంతో.. పుష్కర్, అజ్మీర్ దర్గాలతో సహా రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =