హింసను తక్షణమే విరమించుకోండి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి

Ukraine-Russia Conflict PM Modi Spoke on Telephone with Russia President Vladimir Putin, Ukraine-Russia Conflict, PM Modi Spoke on Telephone with Russia President Vladimir Putin, PM Modi, Russia President Vladimir Putin, Narendra Modi Prime Minister of India, Narendra Modi, Prime Minister of India, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకున్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర‌ష్య‌న్ ఫెడ‌రేషన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధానికి వివరించారు. అనంతరం రష్యా మరియు నాటో గ్రూపు మధ్య ఉన్న విభేదాలు చిత్తశుద్ధి మరియు నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని ప్రధాని మోదీ తన దీర్ఘకాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

హింసను తక్షణమే విరమించుకోవాలని ప్రధాని మోదీ పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలు మరియు సంభాషణల మార్గానికి తిరిగి రావడానికి అన్ని వైపుల నుండి సంఘటిత ప్రయత్నాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరుల భద్రతకు సంబంధించి, ముఖ్యంగా విద్యార్థులుపై భారతదేశం యొక్క ఆందోళనల గురించి కూడా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడికి అవగాహన కల్పించారు. ఉక్రెయిన్‌ లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకురావడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలియజేసారు. ఈ క్రమంలో తమ అధికారులు మరియు దౌత్య బృందాలు సమయోచిత ఆసక్తి ఉన్న సమస్యలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =