వింబుల్డన్‌ టైటిల్‌ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్

Djokovic Wins 20th Grand Slam, How Novak Djokovic Beat Matteo Berrettini In The Wimbledon, Mango News, Novak Djokovic wins 20th Grand Slam title, Wimbledon, Wimbledon 2021, Wimbledon 2021 Final, Wimbledon 2021 Men’s Singles Highlights, Wimbledon final, Wimbledon Final 2021, World No.1 Novak Djokovic, World No1 Novak Djokovic Defeated Italy’s Matteo Berrettini, World No1 Novak Djokovic Defeated Italy’s Matteo Berrettini in the Final

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్ ను ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ ఆరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన వింబుల్డన్‌-2021 ఫైనల్‌ పోరులో ఇటలీ ఆటగాడు, ప్రపంచ తొమ్మిదో నంబర్ ఆటగాడు మాటో బెరిటిని ను 6-7 (4-7), 6-4, 6-4, 6-3 తేడాతో ఓడించిన జకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. దీంతో జకోవిచ్ ఇప్పటివరకు తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లాములు సొంతం చేసుకుని అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన రోజర్ ఫెదరర్‌ (20), రఫెల్‌ నాదల్(20) సరసన చేరాడు. ముందుగా వింబుల్డన్‌ ఫైనల్లో టైబ్రేకర్‌ లో మొదటి సెట్‌ను కోల్పోయిన జొకోవిచ్, తిరిగి ప్రత్యర్థి బెరిటినిపై ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా మూడు సెట్‌ లను సొంతం చేసుకొని వింబుల్డన్‌ టైటిల్ చేజిక్కించుకున్నాడు. 2011, 2014, 2015, 2018, 2019, 2021 సంవత్సరాలలో జకోవిచ్ వింబుల్డన్‌ టైటిల్ ను గెలుచుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 6 =