ఢిల్లీ మద్యం కుంభకోణం: ఏ విచారణకైనా నేను సిద్ధం, భయపడేది లేదు – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam TRS MLC Kavitha Responds Over ED Mentioned Her Name in Remand Report,Delhi Excise Policy Scam,Ed Arrests Buddy Retail Pvt Ltd,Director For Investigation,Mango News,Mango News Telugu,Delhi Excise Policy Scam Latest News And Updates,Delhi Excise Policy Scam News And Live Updates,Delhi Liquor Policy Scam,Delhi Liquor Scam Accused List,Delhi Excise Policy,Delhi Excise Policy Case,Delhi Excise Policy 2022,Delhi Excise Policy Upsc,TRS MLC Kavitha

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండటం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం, ఆమెకు సంబంధించిన పలు కీలక విషయాలు మీడియాలో వెల్లడి కావడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఎమ్మెల్సీ కవిత గురువారం దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణలో మరో సంవత్సరంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని, ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఏ రాష్టంలో అయినా పాగా వేయాలనుకున్నప్పుడు ప్రధాని మోదీ ప్రచారానికన్నా ముందు ఈడీ రంగంలోకి దిగుతుందని, ఇలాంటి రాజకీయాలలోనే ఈ ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 9 ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టారని కవిత విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిందని, సీఎం కేసీఆర్ ప్రజాబలం ముందు తట్టుకోలేక ఆయనను ఇబ్బంది పెట్టడానికి ఆయన కుమార్తెనైన తనపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. అయితే ఇలాంటివాటికి భయపడేది లేదని, ఈ కేసులో ఏజెన్సీ సంస్థకు సహకరిస్తానని, అడిగినవాటికి సమాధానాలు చెబుతానని తెలిపారు. మహా అయితే ఏం చేస్తారు? జైల్లో పెడతారా? అని ప్రశ్నించిన కవిత కావాలంటే తనను జైల్లో పెట్టుకోండి పర్లేదని వ్యాఖ్యానించారు.

కాగా ఈడీ రిపోర్టులో కవితతో పాటు మొత్తం 36మంది బిగ్ షాట్స్ పేర్లు ఉండటం విశేషం. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, సృజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఈ 36మంది కలిసి దాదాపు రూ.100 కోట్ల విలువైన కుంభకోణానికి పాల్పడ్డారని, వీరి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా వీరందరూ కలిసి ఈ వ్యవహారంలో 170 ఫోన్లను వినియోగించారని, ఎన్నోసార్లు ఫోన్లను, సిమ్ కార్డులను మార్చేవారని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని, అయితే వీటిలో కేవలం 17 ఫోన్లను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకోగలిగిందని తెలియజేశారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here