రాజస్థాన్ లో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 6PM-5AM నైట్ కర్ఫ్యూ

Mango News, Rajasthan govt announces COVID curbs, Rajasthan Govt Imposes 6 pm to 5 am Night Curfew, Rajasthan Govt Imposes 6 pm to 5 am Night Curfew till April 30, Rajasthan Govt Imposes Night Curfew, Rajasthan govt imposes night curfew from 8pm to 6am, Rajasthan govt imposes night curfew in 9 cities, Rajasthan govt to impose 12-hr night curfew in all cities, Rajasthan imposes night curfew, Rajasthan imposes night curfew from 6pm to 6am, Rajasthan imposes night curfew from 6pm to 6am in all cities, Rajasthan night curfew

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మార్కెట్లు మరియు వాణిజ్య సంస్థలు సాయంత్రం 5 గంటలకు, రాష్ట్ర కార్యాలయాలు సాయంత్రం 4 గంటలకు మూసివేయబడతాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ కోసం చర్యలను మరింత కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో అత్యవసర సేవలు మరియు ఆరోగ్య సేవలు, కోవిడ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలు, నిరంతర ఉత్పత్తి ఉండే ఫ్యాక్టరీస్ మరియు రాత్రి షిఫ్ట్ ఉన్న కర్మాగారాలు, కెమిస్ట్స్, ఐటి కంపెనీలు, వివాహ వేడుకలు, బస్సులు, రైల్వే, విమానాశ్రయ ప్రయాణీకులు, వస్తువుల రవాణా, లోడింగ్ కు ఈ కర్ఫ్యూ వర్తించదని చెప్పారు. ఈ మినహాయింపుకు ప్రత్యేక పాస్ అవసరం లేదని, గుర్తింపు కార్డు, ఆహ్వాన కార్డు, ప్రయాణ టికెట్ వంటి పత్రాలను చూపవచ్చని చెప్పారు. మరోవైపు రాజస్థాన్ లో ఇప్పటివరకు మొత్తం 3,81,292 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,33,379 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,008 మంది మరణించారు. ప్రస్తుతం 44,905 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =