నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi Makes Surprise Visit to the New Parliament Building Inspects Various Works For Over An Hour,PM Modi Makes Surprise Visit to the New Parliament,PM Modi Inspects Various Works of Parliament Building,PM Modi Inspects Various Works For Over An Hour,Mango News,Mango News Telugu,PM Modi Surprise Visit Latest News,New Parliament Building Latest Updates,Indian PM Narendra Modi,Narendra modi Latest News and Updates,PM Modi Parliament Visit News Today

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 30, గురువారం సాయంత్రం నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను పరిశీలించారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు, సిబ్బందితో ప్రధాని కాసేపు సంభాషించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తుదిదశకు చేరుకున్న పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆసాంతం పరిశీలిస్తూ, గంటకు పైగానే భవనంలోనే గడిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ సహా ఇతర సౌకర్యాలను ప్రధాని మోదీ పరిశీలించారు.

ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి 2020, డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును రూ.971 కోట్లతో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని భావించగా, నిర్మాణ పనుల్లో కొంత జాప్యం కారణంగా ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో నూతన పార్లమెంట్ భవనాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతి ఎంపీకి ప్రత్యేక ఆఫీస్, అలాగే కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌, లైబ్రరీ, ఆరు కమిటీ రూమ్‌లు, ఎంపీల లాంజ్‌, డైనింగ్ ప్రదేశాలు, విశాల పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక భవిష్యత్ లో పెరిగే సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్ ల‌లో సిట్టింగ్ సామర్ధ్యాన్ని కూడా పెంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 5 =