హ్యాష్ ట్యాగ్ జోమో ట్రెండింగ్‌కు రీజనేంటి?

FOMO,JOMO, Fear of missing out,JOMO,Do you know Fomo and Jomo?, hashtag Jomo trending?, Joy of Missing Out, Latest Technologies, Latest Internet Updates, Social Media, Media Updates, Trending, Trending Updates, Mango News Telugu, Mango News
FOMO,JOMO, Fear of missing out,JOMO,Do you know Fomo and Jomo?, hashtag Jomo trending?

సోషల్ మీడియాలో  రీసెంట్‌గా హ్యాష్ ట్యాగ్ జోమో పేరుతో ఉన్న ఒక పోస్టు కొన్నివేల మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. దీంతో  అందరూ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. మొన్నటివరకూ ఫోమో అన్నారు..ఇప్పుడు  జోమో అంటున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది. సోషల్ మీడియా వాడకానికి బాగా అలవాటుపడితే దాని నుంచి బయట పడటం చాలా ఇబ్బందిగా పడతారు.

కొంతమంది అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎన్నో అప్డేట్స్ మిస్సయ్యామని, ఫ్రెండ్ , ఫ్యామిలీ సర్కిల్స్‌లోని యాక్టివిటీస్ తెలియకుండా పోతున్నాయని, ముఖ్యమైన ప్రోగ్రాములు, మంచి ఆఫర్లను మిస్ అవుతున్నామనే  ఆలోచనతోనే ఉంటారు. దీనినే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్..సింపుల్‌గా  ఫోమో అంటారు. అయితే దీనికి భిన్నంగా సోషల్ మీడియాకు దూరమైనా కూడా ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందంగానే ఉండగలిగితే దానిని జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే..సింపుల్‌గా జోమో అంటున్నారు..

జోమో అనేది హ్యాపీనెస్‌కు సంబంధించిన ఒక అసాధారణ మానసిక స్థితిగా చెబుతారు. ఇది సోషల్ మీడియాకు దూరమైనప్పటికీ కూడా వారిలో ఎటువంటి ఆందోళన కానీ, ఏదో కోల్పోయామనే భయం కానీ ఏమీ కనిపించదు. కానీ ఫోమో  పరిస్థితిలో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో తాము మిస్ అయినవన్నీ ఇంకొకరు అనుభవిస్తున్నట్లు ఊహించుకొని ఎక్కువగా ఆలోచిస్తారు.  తాము సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో వేరే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారని, తమకంటే అన్ని విషయాల్లో బెటర్ అవుతూ ఉంటారని అనుకుంటారు. ఇటువంటి అతి ఆలోచనలు, ఆందోళనలవల్ల ఆ వ్యక్తులు తరచూ భావోద్వేగాలకు లోనవడం వల్ల అది వాళ్ల మానసిక ఆరోగ్యంపైన నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.

కానీ జోమో పరిస్థితిలో ఉన్నవాళ్లు మాత్రం  సోషల్ మీడియాకు దూరమై  తమకు నచ్చిన విషయాలపై ఫోకస్ పెడతారు. అయితే జోమో, ఫోమోలలో ఎందుకింత వ్యత్సాసం అనే విషయంపై నిపుణులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం తమ పర్సనల్ విషయాలను తరచూ సోషల్ మీడియాలో  పంచుకోవడం, ఎవరో ఒకరిని ఫాలో అవడం, లేదా తమ ఫాలోవర్లు,  పెట్టిన పోస్టులకు  ఏదో ఒకటి కామెంట్ రావడం, మళ్లీ బాధితులు రియాక్ట్ అవడం వంటి పరిస్థితులు తమను ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తాయని జోమో పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చెబుతున్నారట.

అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటామని అంటున్నారట. పైగా సోషల్ మీడియా నుంచి డిస్‌కనెక్ట్ అవ్వడంవల్ల చాలా సమయం మిగిలి ఉండటంతో హెల్తీ లైఫ్‌స్టైల్‌ అలవర్చుకుంటున్నామని చెప్పారట. దీంతోనే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నంతకాలం కూడా అంతా హ్యాపీగా ఉంటామనే సందేశం ఇవ్వడానికి ప్రజెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్లు #జోమో పేరుతో ఆకట్టుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాకు  ఎడిక్ట్ అయిపోయారని.. ముందు ముందు దీని ప్రభావం మరింత  ఉంటుందని..అందుకే దీని నుంచి అంతా  బయటపడాలని ఇన్‌ప్లుయెన్సర్లు  అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =