నేటి ప్రపంచ పరిస్థితిలో, దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉంది: ప్రధాని మోదీ

PM Modi Says Whole World's Attention is on India's Budget Amid Uncertainty in Global Economy,Parliament Budget Session 2023,President Murmu Addressed, The Lok Sabha and Rajya Sabha,PM Modi Attends,Mango News,Mango News Telugu,Parliamentary Committee Meeting Today,Cabinet Committee Meeting Today,Lok Sabha Committee Meeting Schedule,Parliament Meeting Schedule,Parliamentary Committees In India,Committee On Delegated Legislation In India,Committee On Delegated Legislation Upsc,Rajya Sabha Meeting Schedule,Parliamentary Committees Chaired By Speaker,Parliamentary Committees Headed By Speaker,Parliamentary Committees Mcq,Parliamentary Committees Members

పార్లమెంట్ బడ్జెట్-2023 సమావేశాలు ఈ రోజు (జనవరి 31, మంగళవారం) ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 2023 సంవత్సరపు బడ్జెట్ సెషన్ ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల ప్రారంభంలోనే ఆర్థిక ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల నుంచి, అన్ని వైపుల నుండి సానుకూల సందేశాలు వస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భం. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఈరోజు తొలిసారిగా ఉమ్మడి సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి గర్వకారణం. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ గర్వించదగినది మరియు ముఖ్యంగా నేడు ఇది మహిళలను గౌరవించే సందర్భం మరియు మారుమూల అడవులలో నివసించే మన దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాన్ని కూడా గౌరవించే అవకాశం. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఈరోజు తన తొలి ప్రసంగం చేయడం ఎంపీలకే కాదు ఈరోజు యావత్ దేశానికి గర్వకారణం. అలాగే మన దేశ ఆర్థిక మంత్రి కూడా మహిళే, రేపు మరో బడ్జెట్ తో ఆమె దేశం ముందుకు రాబోతోంది” అని ప్రధాని అన్నారు.

నేటి ప్రపంచ పరిస్థితిలో, దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితుల దృష్ట్యా భారతదేశ బడ్జెట్ భారతదేశంలోని సామాన్యుల ఆశలు మరియు కలలను నెరవేర్చడానికి ప్రయత్నించడమే కాకుండా, ప్రపంచం చూస్తున్న ఆశా కిరణంగా, మరింత ప్రకాశవంతమైనదిగా చూడాలి. ఈ అంచనాలను నెరవేర్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీ అత్యంత కృషి చేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు.

“భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకే ఒక అబ్జేక్టివ్, ఒక నినాదం, ఒకే లక్ష్యం ఉంది మరియు పని సంస్కృతి యొక్క ప్రధాన ఆలోచన ‘ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్’, దేశప్రజలు ఫస్ట్. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, బడ్జెట్ సెషన్‌లో కూడా చర్చ ఉంటుంది, కానీ చర్చ జరగాలి మరియు ప్రతిపక్ష మిత్రులందరూ చాలా సన్నద్ధతతో చాలా నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత సభలో తమ అభిప్రాయాలను తెలియజేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. దేశ విధాన రూపకల్పనలో సభ చాలా బాగా చర్చించి దేశానికి ఉపయోగపడే అభివృద్ధిని, ప్రయోజనాలను వెలికితీస్తుంది. ఎంపీలు అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =