పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.18000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

PM Narendra Modi Releases Rs 18000 Cr as Next Instalment under PM-KISAN,Narendra Tomar,Narendra Singh Tomar,PM Kisan,PM Modi,PM Cares,PM Kisan Fund,PM Cares Fund,Agriculture Min Announces 2nd Installment Of PM-KISAN,Funds Transferred To 9 Crore Farmers,PM Modi Releases Next Instalment Of Rs 18000 Crore,PM Modi Releases PM-KISAN Instalment To 9 Crore Farmers,PM Releases Next Instalment Under PM-KISAN,Modi Releases PM-KISAN Instalment,PM-KISAN Installment To 9 Crore Farmers,Mango News,Mango News Telugu,PM Modi,PM-KISAN,PM-KISAN Money,Pradhan Mantri Kisan Samman Nidhi,Prime Minister Narendra Modi,PM-KISAN Next Instalment Releases

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.18 వేల కోట్లును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు విడుదల చేశారు. ఈ నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం అనంతరం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశంలోని ఆరు వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌తో ప్ర‌ధాని మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా రైతులు త‌మ సాధ‌క‌బాద‌కాల‌తో పాటుగా పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం స‌హా రైతు సంక్షేమం కోసం కేంద్రం చేప‌ట్టిన ఇత‌ర చ‌ర్య‌ల‌పై త‌మ అనుభ‌వాల‌ను ప్ర‌ధానితో పంచుకున్నారు. ప్ర‌ధాని మోదీతో పాటుగా ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు.

ముందుగా దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద మ‌రో విడ‌త‌ రూ.2000 సాయాన్ని రైతుల‌ ఖాతాల్లో జ‌మ చేసే ప్రక్రియను ఈ రోజు ప్రారంభించారు. ఇందుకు అవ‌స‌ర‌మ‌య్యే రూ.18,000 కోట్ల‌కుపైగా నిధులను ప్ర‌ధాని న‌రేంద్ర ‌మోదీ విడుద‌ల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =